ఓటీఎస్‌పై దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోండిఓటీఎస్‌పై దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోండి:


లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి

– అధికారులకు సీఎం ఆదేశం


అమరావతి (ప్రజా అమరావతి):  జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్‌ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలనుకూడా చూపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉదయం సీఎం కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యంత్రి ఈ ఆదేశాలిచ్చారు.