కొవ్వూరు (ప్రజా అమరావతి);
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాల
ని, ఇప్పటి వరకు ఇళ్ళు నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులకి చెల్లింపులు జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) సూరజ్ గానోరే పేర్కొన్నారు.
బుధవారం కొవ్వూరు అర్బన్ కి చెందిన కృష్ణారావు చెరువు, స్పెక్ లే అవుట్, తదితర ప్రాంతాల్లో హౌసింగ్ కార్పోరేషన్ ఎండి కమలకర్ బాబు, జేసి ఆసరా పి.పద్మావతి , హౌసింగ్ డీఈ సీహెచ్ బాబూరావు, మునిసిపల్ కమీషనర్ పి. రవికుమార్ , ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా సూరజ్ గానోరే మాట్లాడుతూ, కొవ్వూరు మునిసిపాలిటీ పరిధిలోని 3 లే అవుట్ లలో లబ్దిదారులచే ఇళ్ల నిర్మాణం పనులు ముమ్మరంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్దిదారులకి సుమారు రూ.1100 కోట్ల మేర చెల్లింపు లను చెయ్యడమే కాకుండా, ఇసుక, ఐరన్, సిమెంట్ వంటి ముడి సరుకుల ను అందచేయ్యడం జరుగుతున్న దని తెలిపారు. క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బంది లబ్దిదారులకి అవగాహన కల్పించడమే కాకుండా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం అందచేస్తున్న ప్రయోజనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపాల్సి ఉందన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో ని లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని స్పష్టం చేశారు. లబ్దిదారులచే పూర్తి చేసిన ఇళ్ల నిర్మాణం ప్రగతి పై డేటా ను ఆన్లైన్ లో నమోదుకి హౌసింగ్ అధికారులు దృష్టి సారించాల్సి ఉందన్నారు. మునిసిపల్ సిబ్బంది, హౌసింగ్ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.
addComments
Post a Comment