శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):

      ఈరోజు అనగా ది. 21-12-2021 న గౌరవనీయులైన విజయవాడ నగర పోలిసు కమీషనరు శ్రీ కాంతి రాణా టాటా గారు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  పోలీస్ కమిషనర్ వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేద ఆశీర్వచనము చేయగా  కార్యనిర్వహణాధికారి గారు శ్రీ అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు, చిత్రపటoను అందజేసినారు. 

       అనంతరం ది.25-12-2021 నుండి ది.29-12-2021 వరకు దేవస్థానం నందు అత్యంత వైభవంగా నిర్వహింపబడు భవానీ దీక్షా విరమణ మహోత్సవముల ఏర్పాట్లు ను పరిశీలించారు. ఇందులో భాగంగా భవానీ మాలా విరమణ దారుల నిమిత్తం ఏర్పాటు చేసిన హోమ గుండం లు, ఇరుముడి సమర్పణ ప్రదేశం, క్యూ లైన్ లు మరియు ఇతర అంశములను పరిశీలించారు.

  ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఏ సీ పి గారు, CI గారు, ఆలయ కార్యనిర్వహక ఇంజినీర్ వారు మరియు అధికారులు పాల్గొన్నారు.

Comments