అమరావతి (ప్రజా అమరావతి);
_*టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు విలేఖరుల సమావేశం వివరాలు..*_
*ప్రజలను చంపడానికి మీకు లైసెన్సు ఇచ్చారా?*
*- కేంద్రమంత్రికి సమాధానం చెప్పకుండా సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగుతారా?*
*- అంతా అయిపోయాక ముఖ్యమంత్రి శ్మశానాలకు శంకుస్థాపన చేస్తారా?*
*- ఓటిఎస్ వసూలు చేయాలని ఈ ప్రభుత్వానికి ఎవరు అధికారం ఇచ్చారు?*
*- అన్నమయ్య ప్రాజెక్ట్ వైఫల్యంపై నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు*
ప్రభుత్వ అసమర్థత, తప్పిదాలతో వరదల వల్ల 62మంది ప్రాణ నష్టం, 6వేలకోట్ల ఆస్తినష్టం సంభవించింది.
కొద్దిగా విజ్జతతో ప్రవర్తించి ఉంటే ఘోర ప్రమాదం తప్పేది, ఇగో తో వ్యవహరిస్తూ మేం చెప్పిందే వేదం అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ పిచ్చితుగ్లక్ గా తయారయ్యారు....రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంటు సాక్షిగా అన్న మాటలకు ఏం సమాధానం చెబుతారు?. ,
ప్రపంచంలో ఇంజనీర్లు ఇదొక కేసు స్టడీగా తీసుకుంటే మనకు అవమానం కాదా, ఎందుకు జవాబుదారితనంతో వ్యవహరించకూడదు?
ముఖ్యమంత్రి బాధ్యతకు అతీతం కాదు, చేతగాకపోతే ముఖ్యమంత్రిగా అనర్హుడు.
ప్రజల ఓట్లు వేసింది ప్రాణాలు తీయడానికి కాదు, కాపాడతారని ఓట్లు వేశారు, ఎప్పుడూ లేనన్ని సీట్లు ఇచ్చారు.
తెలిసే, తెలియకో ఓట్లేసినందుకు ప్రాణాలు తీస్తారా?
18వతేదీ ఉదయం తుపాను వస్తుందని వాతావరణశాఖ చాలా స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నారు, సమాధానం చెప్పిండి.
అప్పటికే రెండుసార్లు వర్షాలు విపరీతంగా పడ్డాయి, రెండుసార్లు వరదలు వచ్చాయి, ప్రాజెక్ట్ లు నిండాయి, 18న మళ్లీ వస్తాయని హెచ్చరిక చేశారు, ముందుగా హెచ్చిరిక చేసిన తర్వాత కూడా ఉదాశీనంగా వ్యవహరించి ప్రాణాలను బలిగొంది మీరు కదా?
ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేసిన తప్పిదం, మీవల్ల 62మంది చనిపోయారు, ఎవరెవరు బాధ్యులో అందరిపై చర్యలు తీసుకోండి, జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయండి, మీపై కేసులు ఉండవా?
కలెక్టర్ ప్రకటన ప్రకారం ఉదయం 8.30గంటలకు పించా ప్రాజెక్ట్ లో 3,845 క్యూసెక్కుల నీరు ఉంటే, సాయంత్రం 8.30కి 90వేల క్యూసెక్కులకు చేరింది, అది అర్థరాత్రికి 1.17లక్షలు వచ్చింది.
ఇంత భారీగా ప్రాజెక్ట్ లో నీరు చేరుతుంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి లేదా?
వాటర్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసే ఒక వ్యవస్థను క్రియేట్ చేశాం, అన్నింటికీ సైంటిఫిక్ గా తయారుచేసి పెట్టాం.
ముందుగా హెచ్చరికలు చేసి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద 27 నవంబర్, 2020లో వరదలు వచ్చాయి, అప్పుడు 5వ గేటు పనిచేయలేదు, అప్పట్లో గేటు మూసుకోక పోవడంతో వరదనీరు గ్రామాల్లోకి చేరింది. ఇప్పుడు గేటు తెరవక పోవడంతో వరద ఉద్ధృతికి ప్రాజెక్ట్ కొట్టకుపోయింది. ఒక్కొక గేటు 45వేల క్యూసెక్కులు, 2.25లక్షలు వదలొచ్చు. 14మీటర్లకుగాను 9.7మీటర్లు ఎత్తారు, 1.25లక్షల క్యూసెక్కులు మాత్రమే డిశ్చార్జి చేశారు, ఫలితంగా 19వతేదీ తెల్లవారుజామున తెగిపోయింది.
ఉదయం 6.30గంటలకు వరద ఊళ్లపై పడింది, ఒక్కరిని కూడా అలర్ట్ చేయలేదు. ఎగుమ మందపల్లి, దిగువ మందపల్లి, పులపత్తూరు, గుండ్లూరు, మరో 12గ్రామాలు డ్యామేజి అయ్యాయి.
తాను ఇంటింటికీ తిరిగి బాధితులతో మాట్లాడినపుడు ఎవరూ హెచ్చరికలు చేయలేదన్నారు, పోయినసారి కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. పొక్లయినర్లు, టిప్పర్లకోసం నీరు విడుదల చేయకుండా ముంచేశారని చెప్పారు.ఒకే కుటుంబంలో తొమ్మిదిమంది చనిపోయారు, ఆ గ్రామంలో ఒక వ్యక్తి సీలింగ్ కొక్కీ పట్టుకొని తొమ్మిదిమందిని పట్టుకున్నాడు, అందులో ఇద్దరు శ్వాస ఆడక భుజంపై చనిపోయారు, ఏడుమందిని కాపాడారు.
అతని ధైర్యం, సమయస్పూర్తితో ఏడుగురిని కాపాడారు, సర్పంచ్ ఊరందరికీ ప్రాణాలు కాపాడుకొమ్మని చెప్పి, ఇంట్లో ముగ్గురిని కోల్పోయారు.
330మీటర్ల కరకట్ట కొట్టుకుపోయింది, 19వతేదీ ఉదయం ప్రమాదం జరిగింది, 18వతేదీ ఉదయం నుంచి వరద పెరుగుతూ వస్తోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది?
19వతేదీ ముఖ్యమంత్రి విన్యాసం చూశారు కదా, నేను అసెంబ్లీ కొస్తే చూడాలని ఉంది, ఇది పైశాచిక ఆనందం కాదా?
వరదలపై చర్చించకుండా ఆరోజు అసెంబ్లీపై మామీద దాడిచేస్తారా?
ప్రధాని వ్యవసాయానికి సంబంధించి ఆరోజు మూడుబిల్లులు రద్దుచేశారు, మీరు కూడా మూడు రాజధానుల బిల్లు రద్దు చేయమంటే ఎగతాళి చేస్తూ మామీద దాడిచేశారు, ఇదెక్కడి న్యాయం?
ముఖ్యమంత్రి కడప వెళ్లి ఏం చేశారు, ఎవరిని బయటకు రాకుండా ఆపడం ఓదార్పు అవుతుందా?
ముందే బాధితులను అధికారులతో భయపెట్టి, కేసులు పెడతామని బెదిరించారు.
బాధితులకంటే ఎక్కువమంది పోలీసులను ఆ గ్రామాల్లో మొహరించారు, ఇది ఏం ప్రజాస్వామ్యం?
నిన్న రాష్ట్ర మంత్రి అనిల్ మాట్లాడుతూ కేంద్రమంత్రి కి ఏం తెలియదంటారా?
ప్రపంచంలో మీకంటే మించినవారు లేరు... ముంచేయడానికి. సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగుతారా?
మీకు ఏమాత్రం ప్రజాస్వ్యామ్యంపై గౌరవం ఉంటే జరిగిన తప్పిదానికి సమాధానం చెప్పండి, లేకపోతే మీరు పదవికి అనర్హులు. తమను చంపడానికి ప్రజలు మీకు లైసెన్స్ ఇచ్చారా, ఘటనకు ఎవరు బాధ్యులో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారంటే రాష్ట్రంలో అరాచకం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ చేతగాని తనం వల్ల 3గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి, పొలాలు, ఇళ్లలో ఇసుక మేటలు వేశాయి.గ్రామాల్లో కనీసం టెంట్లు వేయలేకపోయారు, ఆడబిడ్డల స్నానాలకు బాత్రూమ్ లు ఏర్పాటు చేయలేకపోయారు.
చిత్తూరులో మూడు చెరువులు ఉండగా, పెరుమాళ్లపల్లి చెరువు తెగి పేరూరుకు, అక్కడ నుంచి తుమ్మలగుంటకు నీరు చేరింది, తుమ్మల చెరువును స్టేడియం చేయడంతో నీరు పద్మావతి వర్సిటీ, రైల్వేస్టేషన్ దిగువ భాగంలో ప్రవహించడంతో తిరుపతిలో 14అడుగుల నీరు చేరింది.
రాయలచెరువు లీకులను అరికట్టకుండా నిర్లక్ష్యం చేశారు, సాధారణ మరమ్మత్తులు చేశారు, అది తెగి ఉంటే 30గ్రామాలు జలమయం అయ్యేవి. నెల్లూరులో మావాళ్లు ఇసుక మాఫియా ఆగడాలపై చాలాసార్లు పోరాడారు, నిరసన తెలిపారు, పెన్నానదిలో ఇసుక దందా జరుగుతోంది, కరకట్టలకు ప్రమాదం ఉందని పోరాడితే మావారిపై కేసులు పెట్టారు.
వరదలకు ఆ కరకట్టలు బలహీనమై తెగిపోయి పొలాలపైకి నీరొచ్చింది, 2వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది, కొన్నివేల కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు.ఇప్పుడు పొర్లు కట్టల కోసం వందకోట్లు ఖర్చుపెడతామంటారా? త్వరలో పనులు ప్రారంభిస్తామని చెబుతారా? శ్మశానికి శంకుస్థాపన చేస్తారా? డెడ్ బాడీలను కనుగొన లేకపోయారు.
తిరుపతిలో ఫుట్ ఫాత్ పై డెడ్ బాడీ వెతికి ఇవ్వలేకపోయారు.వరదలతో జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి. సిగ్గు లేకుండా, మనస్సాక్షి లేకుండా పెళ్లికిపోయారు. అధికారాన్ని సక్రమంగా ఉపయోగించి ఉంటే ప్రాణాలు కాపాడే వారు.
రూ. 6వేల కోట్ల ఆస్తి, 62ప్రాణాలు మీ వల్లే పోయాయి, మీ చేతగానితనం వల్లే పోయాయి, కేంద్రమంత్రికి సమాధానం చెప్పండి.
మీరు చేస్తున్నది న్యాయమా, ధర్మమా అని మీ మనస్సాక్షిని అడగండి, విజ్జులు ఆలోచించాల్సి ఉంది, ఇంకా అధికారపార్టీని వెనకేసుకొస్తూ ఒక పేటిఎం బ్యాచ్ రాష్ట్రంలో పనిచేస్తోంది. ధర్మంతో ఆడుకుంటే మంచిది కాదు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని రాజీనామా చేయమన్నా, పదవికి అర్హత లేదన్నా తక్కువే అవుతుంది, సున్నితమైన ప్రభుత్వం అయితే సిగ్గుతో తలదించుకుంటుంది.
ఈ ముఖ్యమంత్రికి అలాంటివేమీ లేవు, ఎదురుదాడిచేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, ప్రజలు తిరగబడితే ఏం చేయలేరు, మీ తప్పిదం వల్ల 62 నిండుప్రాణాలు పోయాయి.
ఎల్ జి పాలిమర్స్ లో మేనేజ్ మెంట్ తప్పిదం వల్ల ప్రమాదం జరిగితే కోటిరూపాయలు ఇచ్చారు, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం మీరు చేసిన తప్పు వల్ల కాదా....మీ నిర్వాకం వల్ల 20ఏళ్లకైనా మాకు ఈ ప్రాజెక్ట్ వద్దు అని అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితులు చెబుతున్నారు.
మీ అసమర్థత చేతగానితనం వల్ల ఇదే ఆలోచన వస్తే భవిష్యత్ లో రాష్ట్రంలో ప్రాజెక్ట్ లు కట్టగలమా?
వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేకపోయారు.
ప్రభుత్వ తప్పిదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి, జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు తీసుకోవాలి.
ప్రాజెక్ట్ గేటుకు గ్రీజ్ వేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారా?
రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు.
మళ్లీ ఇటువంటి పునరావృతం చేయకుండా చర్యలు తీసుకోవాలి. నష్టపరిహారం కూడా తగ్గించారు, వాటిపై కూడా పోరాడతాం. ముఖ్యమంత్రి బాధితుల పరామర్శకు వెళ్లినపుడు ఒక ముసలావిడ నవ్వుతూ మాట్లాడుతోంది, అది జగన్ మార్కు రాజకీయం.
ప్రపంచంలో ఎక్కడన్నా ఇలా జరుగుతుందా, 62మంది చనిపోతే బాధ ఉండదా? సిఎంను పొగుడుతారా? గడ్డం పట్టుకుని ముద్దు పెట్టుకుంటారా? ఇటువంటి తప్పుడు పనులు చేసి అప్రతిష్ట పాలయ్యారు.
బుద్ది,జ్జానం లేకపోతేనే ఇటువంటి ఆలోచనలు వస్తాయి, బాధ్యతలేని వ్యక్తులు ఏంచేసినా జరిగిపోతుందనే ధీమాలో ఉన్నారు. చివరికి న్యాయం కోసం బాధితులంతా కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, ఏమిటీ దుర్మార్గం, రాష్టాన్ని సర్వనాశనం చేశారు, పిండిపిప్పి చేశారు, చివరకు దేవుడ్ని, కేంద్రాన్ని, వ్యవస్థలను, ప్రజలను కూడా తప్పుపడతారు, వీరు ఏంచేసినా మనం భరించాలి.
_*ఒటిఎస్ కు ఎవరిచ్చారు ఈ ప్రభుత్వానికి అధికారం?*_
ఒటిఎస్ పెట్టడానికి ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు పర్మిషన్, ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు ఇచ్చాం, మా ఇళ్లు అని లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు, నువ్వు ఇచ్చావా, నీకు సంబంధం ఉందా, మాట్లాడితే కేసులు పెడతారా, పెట్టుచూద్దాం.
ఒక మహిళ తీవ్ర ఆవేదనతో సొమ్ము ఎక్కడ తేవాలని అంటోంది?
వారిపై కేసులు పెడతావా, వారి తరపున పోరాడితే కేసులు పెడతారా, ఇది ముఖ్యమంత్రి అహంకారానికి పరాకాష్ట.
పేదలు తిరుగుబాటు చేస్తే మీ ఆటలు సాగవు, ఇప్పటికే సెక్యూరిటీ పెట్టుకునే తిరిగే పరిస్థితి వచ్చింది.
ఒటిఎస్ వత్తిళ్లకు ప్రజలెవరూ ఎవరూ భయపడొద్దు, సరెండర్ కావద్దు, టిడిపి ప్రభుత్వం వస్తూనే ఒకనెలలోపు శాశ్వతంగా పట్టా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రజలకు భరోసా ఇస్తున్నా, ధైర్యంగా నిలబడండి, తెలుగుదేశం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పేవరకు పోరాడి హక్కును సాధించుకుందాం. ఒటిఎస్ కోసం వత్తిడి చేసే బదులు తనను చంపేయమని ఓ ముసలావిడ అంటోంది.
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
లబ్ధిదారులకు బలవంతపు అప్పులు కూడా ఇప్పిస్తున్నారు, కాల్ మనీ గాళ్లనుంచి, వారు ఏమవ్వాలి, పించనే వారికి ఆధారం. వేధింపులు తట్టుకోలేక చనిపోతేనే బెటరని అనుకునే పరిస్థితికి తెచ్చారు, పేదల మానసిక క్షోభ మంచిదికాదు.హెల్త్ యూనివర్సిటీ విసిని చూస్తే జాలి వేస్తోంది, రాజీనామా చేయండి, ఎందుకు ఆ పదవి?
పనికి మాలిన ప్రభుత్వం, ఆ విసి చేతగానివాడిగా చరిత్రలో మిగిలిపోతారు, జీవితాతంతం ఆయన అంతర్మథనం చెందుతారు, ఒక యూనివర్సిటీ 400 కోట్లు నిధులు ఉంటే వాటిని కూడా కొట్టేస్తారా?
డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఎల్ఐసిలో పొదుపు చేసుకుంటే ఆ నిధులు కూడా డ్రా చేస్తారా?
ఏమిటి మీకు హక్కు, పేదమహిళలు పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము అది. ఈ ప్రభుత్వానికి విశ్వసనీయతలేదు, ఏది చెప్పినా దానిపై నిలబడరు, అనునిత్యం మడమతిప్పుతారు, హోదా తెస్తామని బీరాలు పలికి కేంద్రంవద్ద మెడలు దించి కాళ్లు పట్టుకుంటున్నారు, ఏంచెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు.
addComments
Post a Comment