తణుకు (ప్రజా అమరావతి);
పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతంగా నిర్వహించడంలో సమన్వయం చేసుకోవాలని జిల్లా ఇంఛార్జి, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు.
శనివారం తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల ను పరిశీలించి, ప్రజా ప్రతినిధులకు, స్థానిక సంస్థల నాయకుల కు తగిన దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, తణుకు పట్టణంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్దిదారులకి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించే కార్యక్రమా
ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. ఇందుకోసం స్థానిక ప్రజా ప్రతినిధులు టీమ్ ల కింద ఏర్పడి బహిరంగ సభకు వొచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివొచ్చేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేపట్టారని ఆళ్ల నాని తెలిపారు. సుమారు 70 వేల మంది ప్రత్యక్షంగా చేసేందుకు బహిరంగ సభ ఏర్పాట్లు చెయ్యడం జరిగిందన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చెయ్యడం జరిగిందని, శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు ప్రత్యక్ష పర్యవేక్షణ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సభకు తరలి వొచ్చే వారికి త్రాగునీరు, అల్పాహారం, భోజనం ఏర్పాట్ల ను పకడ్బందీగా అమలు చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. సభ ప్రాంగణంలో ని వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ల్స్ లని పేర్ని నానితో కలిసి పరిశీలించారు.
జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్ర లో గతంలో ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా 52 లక్షాల కుటుంబాలకు గతంలో ప్రభుత్వం మంజురూ చెసిన ఇళ్ల పై, స్థలాలుపై సంపూర్ణ హక్కు కల్పించే దిశగా ఓటీఎస్ పధకాన్ని అమలు చేయడం, ప్రతి పక్షాలకు కునుకు లేకుండా చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడానికి కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడితే ఓర్వలేక కొందరు ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.
అనంతరం ఎస్ కె ఎస్ మహిళా కళాశాల లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది.
,
ఈ పర్యటన లో ప్రభుత్వ మీడియా సలహాదారు, శాసన మండలి సభ్యులు తలసిల రఘురాం, శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, జి. శ్రీనివాస్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే పాతపటి సర్రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment