రిమ్స్ లో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ వల్ల ఎలాంటి అపాయం లేదు



*రిమ్స్ లో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ వల్ల ఎలాంటి అపాయం లేదు


*


* *జిజిహెచ్ పరిపాలనాధికారి, జేసీ (హౌసింగ్) ధ్యానచంద్ర*


కడప, డిసెంబర్ 18 (ప్రజా అమరావతి): కడప ప్రభుత్వ సర్వజన ఆసు

పత్రి (జిజిహెచ్) లేబర్ వార్డులో పేషంటుకు వినియోగిస్తున్న ఆక్సిజన్ సిలిండర్ స్వల్ప లీకేజీ వల్ల ఎలాంటి అపాయం జరగలేదని.. జిజిహెచ్ పరిపాలనధికారి, జేసీ (హౌసింగ్) ధ్యానచంద్ర  పేర్కొన్నారు.


శనివారం రిమ్స్ ఆవరణలోని జిజిహెచ్ లేబర్ వార్డులో ఆక్సిజన్ గ్యాస్ లీకేజీ అవుతోందన్న వదంతులు రావడంతో.. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు... జిజిహెచ్ పరిపాలనాధికారి, జేసీ (హౌసింగ్) ధ్యానచంద్ర రిమ్స్ కు  తక్షణమే వెళ్లి పరిశీలించారు.


 ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లేబర్ వార్డులో సెంట్రల్ ఆక్సిజన్ సపోర్టు తో ఉన్న పేషెంట్ ను .. చిన్న ఆక్సిజన్ సిలిండర్ (1.5 లీటర్స్) సపోర్టుతో.. ఆ పేషంట్ ను  సిటీ స్కానింగ్ నిమిత్తం సిటీ స్కాన్ రూముకు తరలిస్తున్న సమయంలో.. సిలిండర్ పై భాగంలో ఉన్న ఫ్లో మీటర్ వాల్వ్ కొంత లూజ్ కావడంతో, ప్రెజర్ కారణంగా స్వల్పంగా గ్యాస్ లీకేజీతో పాటు శబ్దం రావడంతో.. స్థానిక పేషంట్లు కొంత భయాందోళనకు గురయ్యారన్నారు. వెంటనే ఆసుపత్రి పరిపాలనా సిబ్బంది అప్రమత్తం కావడం, పరిస్థితిని పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఫ్లో మీటర్ వాల్వ్ కొంత లూజ్ కావడంతో, ప్రెజర్ కారణంగా స్వల్పంగా గ్యాస్ లీకేజీతో పాటు శబ్దం రావడంతో  పేషంట్లు, సిబ్బంది ఒకింత కంగారుకు గురయ్యారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన పడవలసి అవసరం లేదని.. జిజిహెచ్ పరిపాలనధికారి, జేసీ (హౌసింగ్) ధ్యానచంద్ర పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో జేసీ (హౌసింగ్) వెంట ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డా. సురేశ్వర్ రెడ్డి, ఆర్.ఎం.ఓ. డా.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 



Comments