యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 విశాఖపట్నం (ప్రజా అమరావతి);


*యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి*
*దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి*


*నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 5 రాష్ట్రాల యువతకు  శుభాభినందనలు* 


*నేడు విజేతలుగా నిలిచిన మీరంతా త్వరలో జగజ్జేతలవ్వాలంటూ  మంత్రి మేకపాటి ఆకాంక్ష*


*ఆద్యంతం యువతీయువకుల్లో స్ఫూర్తి నింపేలా సాగిన మంత్రి మేకపాటి ప్రసంగం*

 

విశాఖపట్నం, నవంబర్, 01 ; విశాఖపట్నంలో దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో  యువతకు పెద్దపీట వేసే ఆలోచనలతో రాష్ట్రం ముందడుగు వేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్ లో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి మేకపాటి పోటీలను ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన, ఆచరణా యువత కోసమే..యువతలాగే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా తానూ స్ఫూర్తి పొందినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఆస్ఫూర్తితో ఆయన అప్పటికప్పుడు ఇంగ్లీష్ లో కవిత వినిపించారు. "గట్టిగా ప్రయత్నిస్తే ఆకాశమేమీ హద్దు కాదు. సముద్రమేం పెద్ద లోతూ కాదు. జీవితంలో ఎన్ని  కష్టాలొచ్చినా ...కన్నీళ్లే సుడిగండంగా మారినా..మంచైనా.. చెడైనా వెనుతిరిగి చూడవద్దు. ఎక్కడా ఆగిపోవద్దు. మీ ఆలోచన, మీ ఆచరణే మీ హద్దు" అంటూ మంత్రి మేకపాటి తన ప్రసంగం ద్వారా యువతలో స్ఫూర్తి నింపారు. అంకితభావంతో ఏదైనా చేయండి..విజయం మీదేనంటూ యువతలో ఉత్సాహపరిచారు. దక్షిణ భారత రాష్ట్రాల యువతీయుకులు, నైపుణ్య పోటీదారులంతా ఇప్పటికే విజేతలయ్యారని, త్వరలో నైపుణ్యం, అంకితభావం, పోరాటపటిమతో  జగజ్జేతలుగా నిలవాలన్నారు. నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 500 మంది యువతీయువకులు భారతదేశాన్ని నడిపించే స్థాయికి చేరాలన్నారు. 


ఎన్ఎస్డీసీ, ఏపీఎస్ఎస్డీసీ సంయుక్తంగా యువత సత్తా చాటే వేదికను ఏర్పాటు చేయడాన్ని మంత్రి మేకపాటి అభినందించారు. వీటి వల్ల యువతకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇప్పటి వరకూ 17.87 లక్షల మంది అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్ సైట్ లో నమోదై శిక్షణ పొందడం అందుకు నిదర్శనమన్నారు.  11సంస్థల భాగస్వామ్యంతో వివిధ నైపుణ్య వేదికలను ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి  నైపుణ్యమున్న యువతను వెలికితీయడాన్ని ప్రశంసించారు. 2019 వల్డ్ స్కిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్య కార్యక్రమంలో  రష్యా లోని కజాన్ లో నిర్వహించిన నైపుణ్య పోటీలలో 63 దేశాలు పాల్గొనగా అందులో  భారత్ 13వ స్థానంలో నిలిచిందన్నారు. 2022 అక్టోబర్ లో చైనాలోని షాంగైలో నిర్వహించే  ప్రపంచ స్థాయి పోటీలలో మరింత సత్తాచాటి పురస్కారాలు అందుకోవాలని మంత్రి మేకపాటి ఆకాంక్షించారు.


నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం, ప్రస్తుతం డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించడం, కొత్త నైపుణ్యాలను సృష్టించడంలో ప్రపంచ స్థాయిలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగాలన్నారు. ఫ్లిప్ కార్ట్, టీవీజీ గ్రూప్, డెల్ టెక్నాలజీస్, జేబీఎమ్ ఆటో లిమిటెడ్, సీఐఐ వంటి ప్రఖ్యాత వంటి పరిశ్రమలు కోరుకున్న నైపుణ్య యువతను  తీర్చిదిద్దేలా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఏపీఎస్ఎస్డీసీ ఎన్నో జాబ్ మేళాలు నిర్వహిస్తూ వేలాది మంది రాష్ట్ర యువతకు ఉపాధి అందింస్తోందన్నారు. దేశంలో యువతకు ఉద్యోగాలిచ్చే మొదటి 10  రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలవడం గర్వించదగ్గ విషయంగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యువత ఆశయాలను నెరవేర్చుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. 


అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాడ్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలకు 5 రాష్ట్రాల నుంచి 450 మందికిపైగా పోటీదారులు పాల్గొంటున్న వారందరికీ అభినందనలు తెలిపారు. 

ప్రతి ఒక్కరూ ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యంతో ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే చదువుతోపాటు అదనపు నైపుణ్యాలు ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల ప్రకారం శిక్షణా కార్యక్రమాలను ఎపిఎస్‌ఎస్‌డిసి  అమలు చేస్తుందని ఆయన అన్నారు.  


అంతకుముందు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి నైపుణ్య పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఐదు రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారందరికీ అభినందనలు తెలిపారు. యువతకు చదువుతోపాటు అదనపు నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేయలని ఆదేశించారని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని జయలక్ష్మి తెలిపారు.    


ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున్,  ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార రాజు, వల్డ్ స్కిల్స్ ఇండియా డైరెక్టర్ ప్రకాశ్ శర్మ, కల్నల్ అరుణ్ చందేల్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image