*వైయస్.జగన్ పాలనలో సామాజిక భద్రత మరింత పటిష్టం*
*అవ్వాతాతలకు వైయస్సార్ పెన్షన్‌కానుక ఇకపై ప్రతినెలా రూ.2500*
*రేపటినుంచే అమలు*
*గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించనున్న సీఎం*
తన పాదయాత్రలో అవ్వాతాతలు సమస్యలు స్వయంగా విన్న ముఖ్యమంత్రి
సామాజిక రుగ్మతగా మారిన వృద్ధుల సమస్యలు
ఉపాధికోసం పట్టణాల బాటపడుతున్న వేళ వారి సమస్యలు మరింత తీవ్రం
గతంలో పెన్షన్‌కు అర్హత సాధించాలంటే పెద్ద ప్రహసనం
పక్షపాతం, అవినీతి, అలసత్వం, రాజకీయం
అర్హత సాధించాక మంజూరులోనూ అదే తీరు
నెలానెలా పెన్షన్ తీసుకోవడానికీ పడరాని పట్లు
తన పాదయాత్రలో అవ్వాతాతలు సమస్యలు స్వయంగా విన్న ముఖ్యమంత్రి
పెన్షన్ విధానాన్ని సమూలంగా మార్చేసిన వైయస్.జగన్
దేశానికే ఆదర్శంగా పెన్షన్ల అర్హత నిర్ధారణ, మంజూరు, పంపిణీ
ఈ ఉద్దేశం నెరవేర్చే క్రమంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ
ఆలోచనకు మెరుగులు దిద్ది గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసిన సీఎం
సూర్యుడు ఉదయించకముందే అవ్వాతాతల చేతిలో పెన్షన్ డబ్బులు
ప్రభుత్వాలలో అనేక çపథకాలకు, కార్యక్రమాలకు దిక్సూచిగా నిలిచిన పెన్షన్లు విధానం
అమరావతి (ప్రజా అమరావతి):
ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సామాజిక భద్రత కల్పించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు ముందుకేసింది. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2250 నుంచి రూ.2500కు పెంచిన పెన్షన్‌ను రేపటి నుంచి అమలు చేయనుంది. కొత్త సంవత్సరం కానుకగా సీఎం వైయస్.జగన్ దీన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రేపు ప్రారంభించనున్నారు.
*గత ప్రభుత్వంలో ఇలా...:*
– గత ప్రభుత్వంలో పెన్షన్‌కేవలం రూ.వేయి రూపాయలు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 2 నెలల ముందు వరకూ వేయి రూపాయలు మాత్రమే ఇచ్చారు.
– గత ప్రభుత్వం హయాంలో సగటున నెలకు పెన్షన్ల రూపేణా చేసిన ఖర్చు నెలకు కేవలం రూ. 400 కోట్లు. ఏడాది మొత్తం సగటు వ్యయం రూ.5,500 కోట్లు.
– ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ ఉన్న పెన్షన్ల సంఖ్య కూడా 39 లక్షలు మాత్రమే.
– రెండున్నర ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాలలోపు మెట్ట పొలం ఉన్నవారికే పెన్షన్ ఇచ్చేవారు.
– ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఇస్తే.. రెండో వ్యక్తికి పెన్షన్ ఇచ్చేవారు కాదు.
– పెన్షన్ కావాలంటే దరఖాస్తు ఎవరికి చేయాలో తెలియని పరిస్థితి. అర్హత సాధించాలంటే జన్మభూమి కమిటీకి ఆమోదం తప్పనిసరి.
– రాజకీయాలు, అవినీతి, పక్షపాతం కనిపించేవి.
– వికలాంగులకు రూ.1500లు, తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.2500 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు.
– గ్రామానికి పెన్షన్లు ఇవ్వడానికి ఒకరు మాత్రమే వచ్చేవారు. సరైన వెయిటింగు హాల్‌గాని, పెన్షన్ తీసుకునేవారికి వసతులు కాని ఉండేవికావు. వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
– పెన్షన్ తీసుకోవడానికి గంటలతరబడి క్యూలో నిలబడేవారు.
– ఒకటో తారీఖున మొదలయ్యే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 10 రోజులు, 14 రోజులు పట్టేది.
*వైయస్.జగన్ పాలనలో...:*
– ఈ ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్.జగన్ ప్రమాణస్వీకారం రోజే రూ.2250కి పెన్షన్ పెంచుతూ సంతకం చేశారు.
– పెన్షన్ పొందడానికి అర్హతను 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు.
– అవ్వాతాతలకు, వితంతువులకు, చేనేతలకు, కల్లుగీత కార్మికులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, చర్మకారులకు, వైద్యసహాయం పొందుతున్న (ఏఆర్టీ) వాళ్ల పెన్షన్లను రూ.2250కు పెంచారు.
– అలాగే వికలాంగుల పెన్షన్‌ను రూ.3వేలకు పెంచారు.
– తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10వేల పెన్షన్ అందించారు.
– తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫీలియా, బోదకాలు, పక్షవాతం, కండరాల క్షీణత, తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి, కుష్టువ్యాధి, కిడ్నీ లేదా కాలేయం లేదా గుండె మార్పిడిని జరిగిన వారికికూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పెన్షన్లను మంజూరుచేశారు.
– పెన్షన అర్హతలను కూడా సడలించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచారు.
– అలాగే భూమి పరిమితిని కూడా పెంచారు. మాగాణి 3 ఎకరాల్లోపు, లేదా 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికీ పెన్షన్లు మంజూరుచేశారు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి పెన్షన్ ఇచ్చేలా నిబంధనలను సడలించారు.
– జీవనోపాధికోసం ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు నడుపుకుంటున్న వారినీ కూడా పెన్షన్ మంజూరుకు పరిగణలోకి తీసుకున్నారు.
– కుటుంబలో వైకల్యం, తీవ్ర వ్యాధులతో, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పెన్షన్ తీసుకుంటున్నా... రెండో వ్యక్తికి కూడా పెన్షన్ మంజూరు చేస్తున్నారు.
*లబ్ధిదారుల ఎంపిక ఇలా...:*
– లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శక విధానాన్ని పాటిస్తోంది.
– అర్హత సాధించగానే గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు.
– తమ గ్రామంలోనే సచివాలయాలద్వారా ప్రతిరోజూ నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమర్పించే సౌకర్యం.
– దరఖాస్తు సమర్పించగానే దానికి రశీదు, నంబరు.
– అర్హలుగా గుర్తించిన వెంటనే వారి జాబితా గ్రామ, వార్డు సచివాయలంలో ప్రదర్శన.
– ప్రజలముందే అత్యంత పారదర్శక పద్ధతిలో సామాజిక తనిఖీ విధానం ద్వారా నిర్ధారణ.
– 21 రోజుల్లో పెన్షన్‌మంజూరు. కార్డు నేరుగా ఇంటివద్దకే వచ్చి ఇస్తున్న వాలంటీర్లు.
– ఇందులో రాజకీయ జోక్యానికి, ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని విధానం.
– ఒకవేళ దరఖాస్తు తిరస్కరించినా.. మరోసారి దరఖాస్తుచేసుకునే విధానం. ఈసారి ఈ దరఖాస్తును పరిశీలించనున్న పై అధికారి బృందం.
– లబ్ధిదారుల గుర్తింపు, ఎంపిక, అర్హతల నిర్ధారణ, మంజూరు, పెన్షన్ల పంపిణీలో ఎక్కడా కూడా అవినీతికి తావులేని వైనం.
*సూర్యోదయానికి ముందే.. అవ్వాతాతల చెంతకే పెన్షన్లు:*
– అవ్వాతాతలకు దగ్గరికే వెళ్లి వారి చేతిలోనే డబ్బుపెట్టే.. డోర్‌డెలివరీ విధానాన్ని ఫిబ్రవరి 1, 2020 నుంచి ప్రారంభించారు.
– ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ. పెన్షన్లు పొందడానికి వాళ్లు ఎలాంటి కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. రోజులతరబడి వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు.
– ఆధార్ కార్డు ఆధారంగా నిర్ధారించి క్షణాల్లో పెన్షన్‌ను వారి ఇంటిదగ్గరే వారిచేతుల్లోనే పెడుతున్నారు.
– పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఎక్కడ?ఎలా జరిగిందో.. రియల్‌టైంలో తెలుస్తుంది. పంపిణీని పర్యవేక్షించేందుకు ఇది తోడ్పాటునందిస్తోంది.
– వేలిముద్రలు సరిగ్గాపడకపోతే.. గతంలోలా పెన్షన్ తిరస్కరించే పద్ధతిలేదు. రియల్‌టైం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టం ద్వారా ఫొటో తీసి వారికి వెంటనే చెల్లిస్తున్నారు.
– ఒవవేళ పెన్షనర్ ఆస్పత్రి పాలు అయితే.. ఆస్పత్రికి వెళ్లి మరీ పెన్షన్ అందిస్తున్నారు.
– 2.66 లక్షలమంది వాలంటీర్లు ఈ ప్రక్రియను ప్రతినెలా ఒకటోతేదీన ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నారు. తొలిరోజే 95శాతంమందికిపైగా పెన్షన్ అందడం కూడా వారి అందిస్తున్న సేవలకు నిదర్శనం.
– డోర్ డెలివరీ పద్ధతిలో పెన్షన్లు అందించడం అన్నది దేశంలోనే తొలిసారి ఇది.
*పెన్షన్లు అందుకుంటున్న వారిలో...*
– దాదాపు 62 లక్షల మందికి ప్రతినెలా పెన్షన్లు అందుతున్నాయి.
– ఇందులో బీసీలు 30,37,048 మంది ఉన్నారు. బ్రాహ్మణులు 23,190 మంది, ఈబీసీలు 10,98,616 మంది, కాపులు 3,93,266 మంది, మైనార్టీలు 2,30,510 మంది, ఎస్సీలు 10,29,440 మంది, ఎస్టీలు 3,62,523 మంది ఉన్నారు.
– ప్రతినెలా రూ.1570 కోట్ల పైనే పెన్షన్లు కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఏడాదికి రూ.18వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.
– వైయస్.జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకూ పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.45వేల కోట్లు.
addComments
Post a Comment