తణుకు (ప్రజా అమరావతి);
తణుకు జిల్లా పరిషత్తు హై స్కూల్ ఆవరణలో
మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు.
హెలిప్యాడ్, కాన్వెయ్ రూట్, జెడ్పి హై స్కూల్ ఆవరణలో ఫోటో ప్రదర్శన, మోడల్ హౌస్ కి సంబంధించిన మౌలిక సదుపాయాల సామాగ్రి, బహిరంగ సభ ప్రాంగణం, వేదిక తదితర ఏర్పాట్లు, రేపు ఉదయం సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు, ఇతర వి ఐ పి , గ్యాలరీలు, త్రాగునీటి వసతి, సానిటేషన్, మెడికల్ క్యాంపు, తదితర ఏర్పాట్లపై మంత్రి వర్యులు శ్రీరంగనాధ్ రాజు, , జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తగిన మార్గదర్సకాలు జారీచేశారు. ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చెయ్యడం లో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, తదితరులు లతో కలిసి జెడ్పి హై స్కూల్ లో మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పర్యటన లో మంత్రి వెంట స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు , జాయింట్ కలెక్టర్ లు, ఇతర అధికారులు , స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment