జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు

నెల్లూరు  (ప్రజా అమరావతి);




జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించిన  ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా  కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  అధికారులను ఆదేశించారు


.


బుధవారం  ఉదయం   గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  అధికారులతో  సమావేశమై  గూడూరు డివిజన్ పరిధిలో  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పురోగతిపై  సమీక్షించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం క్రింద   గుర్తించిన లబ్ధిదారులందరు ఈ నెల 20వ తేదీ లోపు  ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక  చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, మండల  అధికారులు,    గ్రామ సచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో  సమావేశమై జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పురోగతిపై  ఎప్పటికప్పుడు   సమీక్షిస్తూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం  విజయవంతం అయ్యేందుకు  చర్యలు చేపట్టాలన్నారు.  సంబందించిన లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై   మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించి, దీనిని స‌ద్వినియోగం చేసుకొనేలా చూడాల‌ని అన్నారు. ఎంత  చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి , దాని వలన లాభాలేంటి  అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన  అధికారులను ఆదేశించారు.  గడువులోగా లక్ష్యాలను  పూర్తి చేయడానికి అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకోవాలన్నారు. వివిధ గృహ‌నిర్మాణ ప‌థ‌కాల ద్వారా రుణాలు తీసుకొని, ఇళ్లు నిర్మించుకున్న‌వారికి, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఆయా ఇళ్లు, స్థ‌లాల‌ను త‌మ పేరుమీద‌ రిజిష్ట‌ర్ చేసుకొనే గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంద‌ని,  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం గురించి   క్షేత్ర స్థాయిలో  లబ్ధిదారులందరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని  జిల్లా కలెక్టర్,  అధికారులను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నూరు శాతం విజయవంతం చేసేందుకు  పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని  కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు అధికారులను  ఆదేశించారు

ఈ స‌మావేశంలో గూడూరు  ఆర్డీవో శ్రీ వి. మురళికృష్ణ,  గూడూరు మునిసిపల్ ప్రత్యేక అధికారి శ్రీ తిరుపాల్ రెడ్డి, గూడూరు మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఖయ్యుం,  గూడూరు మునిసిపల్ కమీషనర్ శ్రీ  బి. శ్రీకాంత్,  గూడూరు తహసీసల్దార్ శ్రీమతి లీలరాణి,  ఎం.పి.డి,ఓ శ్రీమతి నాగమణి, ఎ.పి.ఓ  శ్రీమతి సుజీవన,   హౌసింగ్ డి.ఈ  శ్రీ శేషయ్య,  ఎ.ఈ శ్రీ షబీర్ 

తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments