ఘనంగా నివాళులు

 నెల్లూరు, (ప్రజా అమరావతి);


తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో దుర్మరణం పాలయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ గారికి శుక్రవారం సాయంత్రం స్థానిక గాంధీ విగ్రహం  సెంటర్ వద్ద జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో  క్యాండిల్స్ వెలిగించి  ఘనంగా   నివాళులు


అర్పించారు.  


ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీ పి.ఎస్. రమేష్,   ఎ.పి.డబ్ల్యు.జె.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జయప్రకాష్, మాజీ సైనిక ఉద్యోగులు,  ఎన్.సి.సి. క్యాడేట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.