ఈ-సేవలు & కొత్త పౌర సేవా పోర్టల్"పై కొవ్వూరు డివిజన్ లో రెండో రోజు శిక్షణ తరగతులు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


ఈ-సేవలు & కొత్త పౌర సేవా పోర్టల్"పై కొవ్వూరు డివిజన్ లో రెండో రోజు శిక్షణ తరగతులు



2022 జనవరి 26 నుంచి అందుబాటులో కి రానున్న సరికొత్త పోర్టల్


డిఎల్ డి ఓ పి.జగదాంబ


మరింత పారదర్శకంగా పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో న్యూ సిటిజన్ సర్వీస్ పోర్టల్ ప్రవేశ పెట్టడం జరుగుతున్నదని డివిజనల్ అభివృద్ధి అధికారి పి. జగదాంబ , మాస్టర్ శిక్షకులు పేర్కొన్నారు. 


గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో" ఈ-సేవలు & కొత్త పౌర సేవా పోర్టల్" పై కొవ్వూరు డివిజనల్ స్థాయిలో రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 


ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ, 

మెరుగైన పౌర సేవలు అందించడంలో డిజిటల్ అసిస్టెంట్ లు, విఆర్వో లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, అర్బన్ ఏరియా - డిజిటల్ అసిస్టెంట్‌లందరికీ  పాత్ర ఎంతో కీలకమైన దన్నారు. అందులో భాగంగానే క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ అందిస్తున్న ట్లు పేర్కొన్నారు. 


మాస్టర్ శిక్షకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగ్గా , పారదర్శకంగా పౌర సేవాలను అందించేందుకు దశల వారీగా పౌర సేవలు మెరుగు పరచడమే ప్రధాన ల 130 పైగా  రెవెన్యూ, మునిసిపల్, మెడికల్, పౌర సరఫరాలకు చెందిన పౌర సేవలను  "26.01.2022న ప్రజలకు అందుబాటులో కి తీసుకుని వొస్తున్నట్లు తెలిపారు. ఈ-సేవలు & కొత్త పౌర సేవా పోర్టల్"  సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా మెరుగ్గా నిర్వహించేందుకు , సమస్యలు పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



రెండో రోజు జరిగిన  డివిజనల్ స్థాయి శిక్షణ కార్యక్రమంలో అదనపు జిల్లా కో-ఆర్డినేటర్, J.బాలకృష్ణ, మాస్టర్ ఆఫ్ ట్రైనర్ ఎండి. ఆలీ, PS Gr-VIడిజిటల్ అసిస్టెంట్ ఎస్ఆర్వి ఎం ప్రభాకర్, వార్డ్ ఎడ్యు.& డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ  SBCC జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.రాజేశ్వరరావులచే సాంకేతిక అంశాలపై  కొవ్వూరు (అర్బన్), నిడదవోలు(అర్బన్), నిడదవోలు-రూరల్, తణుకు-రూరల్,  కొవ్వూరు రూరల్,  పెనుమంట్ర, పెనుగొండ,   ఇరగవరం మండలాలకు చెందిన 230 మంది సచివాలయ ,  తదితర మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.