భవానీ దీక్షా విరమణ క్యూ లైన్ పనులు ప్రారంభం:

 భవానీ దీక్షా విరమణ క్యూ లైన్ పనులు ప్రారంభం: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి): 

      దేవస్థానం నందు ది.25-12-2021 నుండి ది.29-12-2021 వరకు నిర్వహించబడు భవానీ దీక్షా విరమణ -2021 మహోత్సవములు  సంబంధించిన క్యూ-లైన్ యొక్క పనులు  ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  ప్రారంభించడం జరిగినది. శ్రీ వినాయక స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభమగు క్యూ- లైన్ యొక్క పనులను ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, కార్యనిర్వహణాధికారి , ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్  మరియు అధికారులు పూజలు నిర్వహించి,కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడము జరిగినది.