అర్హులైన ఏ ఒక్కరు పథకాల లబ్దికి దూరం కాకూడదన్నది ప్రభుత్వ సంకల్పము



నెల్లూరు, డిసెంబర్ 28 (ప్రజా అమరావతి):-- దేశంలోనే మరే రాష్ట్రంలోనూ  లేని విధంగా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


 మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి  తాడేపల్లిలోని వారి క్యాంపు కార్యాలయం నుండి  వివిధ ప్రభుత్వ పథకాలు మంజూరుకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరు పథకాల లబ్దికి దూరం కాకూడదన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు


. నేడు  వైయస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం తదితర పథకాలకు సంబంధించి 9,30,809 మంది లబ్ధిదారులకు  దాదాపు 703 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. 

చేకూరుస్తున్నామన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా జాబితాను ప్రదర్శించి 

కుల, మత ,వర్గ,పార్టీలకు అతీతంగా అవినీతి వివక్ష ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా నూటికి నూరు శాతం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అర్హులై ఉండి కూడా ఒకవేళ ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి మరో అవకాశాన్ని కూడా ఇస్తూ ప్రతి ఏటా జూన్ డిసెంబర్లలో లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.



 అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ శ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి, నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్ తో కలిసి పలువురు లబ్ధిదారులకు డి ఆర్ డి ఎ ద్వారా మెగా బ్యాంకు చెక్కులు,  ఇంటి పట్టాలు,  నేతన్న నేస్తం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు రావడం జరిగిందన్నారు.  ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరవేయడానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతో పారదర్శకమైన ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులైన లబ్ధిదారులు పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాక వెంటనే ఆమోదించి లబ్ధి చేకూర్చే ఆస్కారం కలిగిందన్నారు. అలాగే  ప్రతి ఇంటికి పథకాలను చేరవేస్తూ ప్రభుత్వం సంక్షేమానికి మార్గం సుగమం చేసిందన్నారు.  ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనారిటీ వర్గాలు, బలహీనవర్గాల ప్రజలు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు.వై ఎస్ ఆర్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ తదితర పథకాల ద్వారా మహిళలకు స్వావలంబన చేకూర్చడం జరుగుతుందన్నారు. వారి ఆర్థిక పురోభివృద్ధికి ఎంతగానో ప్రభుత్వం సహాయపడుతుందన్నారు. అర్హులై ఉండి కూడా ఇటువంటి పథకాలు ఇంకా పొందని వారు ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి పథకానికి అదనంగా ఒక నెల సమయం ఇవ్వడం జరిగిందన్నారు. ఆ విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి సంవత్సరంలో రెండు సార్లు అంటే జూన్ డిసెంబరు నెలలో అన్ని పథకాల ప్రయోజనాలు విడుదల చేయడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది జూన్ నెల నుండి ఇప్పటివరకు వివిధ పథకాలకు ఎవరైనా లబ్దిదారులు అర్హత ఉండి  సచివాలయాల్లో లేదా స్పందన కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకున్న 40 వేల మందికి 30 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం మంజూరు అయిందని చెప్పారు. ఈ సహాయం అంతా కూడా సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుందన్నారు.


90 రోజుల్లో ఇంటి పట్టాల కార్యక్రమంలో భాగంగా గతంలో మంజూరు చేయగా ఇంకా మిగిలిపోయిన వారు 7554 మంది లబ్ధిదారులకు కొత్తగా ఇంటి పట్టాలు మంజూరై పంపిణీ చేస్తున్నామన్నారు. వెంకటగిరి తదితర ప్రాంతాల్లో " వైఎస్ఆర్ నేతన్న నేస్తం " గత రెండు విడతల్లో రాని 80 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అన్ని పథకాలను ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. వచ్చేజనవరి ఒకటో తేదీ నుండి నెలకు వైఎస్సార్ పింఛను కానుక 2,250 రూపాయల నుండి  2500 రూపాయలకు పెంచారన్నారు. తద్వారా జిల్లాలో 8582 మంది లబ్ధి పొందుతున్నారన్నారు. జిల్లాలో ప్రతి ఇంటికి వాలంటీర్లు పోయి పింఛన్లు అందజేస్తున్నారన్నారు.  ఇంకా ఎవరైనా  లబ్ధిదారులు అర్హత ఉండి కూడా ప్రయోజనాలు పొందకుంటే దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయల్లో,  స్పందన కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా ఆరు నెలల్లోగా పథకాలు మంజూరు చేస్తామన్నారు. ప్రజలు ఇచ్చే అర్జీలను 30 రోజుల లోగా పరిష్కరిస్తామన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.


 పథకాలు పొందిన లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. 


 శ్రీమతి పిడుగు పోలమ్మ, చిన్న పడుగుపాడు, కోవూరు మండలం --------------------

 తమది పేద కుటుంబం అని తాను బట్టీల లోకూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నానని, తన భర్త మల్లికార్జున పెయింటింగ్ కూలిపనులకు వెళ్తున్నారని, తమకు స్థలం లేక రోడ్డుపైన పడుకుంటున్నామని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి  ఆశీస్సులతో తొమ్మిది    అంకణాల ఇంటి స్థలం పట్టా  పొందగలిగానని ఆ స్థలంలో జగనన్న ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పినందుకు ఆమె ఎంతగానో సంతోషిస్తున్నామన్నారు.  తాము ముఖ్యమంత్రి కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆమె చెప్పింది. 



శ్రీమతి కన్నా పద్మ, నారాయణ రెడ్డి పేట, నెల్లూరు.

-------------------

తమకు  వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం కింద 2019, 20  సంవత్సరాల్లో రెండుసార్లు 24 వేల రూపాయలు అందాయని అయితే హౌస్ కోడ్ సాంకేతిక సమస్య వలన ఈ ఏడాది రాలేదని మరలా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం 24 వేల రూపాయలు మంజూరు చేసినందులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇటీవల వర్షాలు వరదల వలన ఎలాంటి వ్యాపారాలు జరగలేదని, చాలా ఇబ్బందులు పడ్డామని ఇటువంటి సమయంలో ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నందులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.



శ్రీమతి ఇనమాల దేవసేన, నరుకూరు గ్రామం, టిపి గూడూరు మండలం

---------------

తమది పేద కుటుంబమని తాను మండల సమాఖ్య అధ్యక్షురాలుగా ఉన్నానని తమ స్మైలీ స్వయం సహాయక  సంఘంలో పదిమంది సభ్యులు ఉన్నామని, ఒక్కొక్కరికి 70 వేల రూపాయల చొప్పున వైఎస్ఆర్ ఆసరా కింద ఆర్థిక సహాయం కొత్తగా మంజూరు అయిందని  దీంతో తాను చీరల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తామని చెప్పారు.  ఆర్థిక సహాయం అందించి  ఆదుకున్నందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతగానో రుణపడి ఉంటామని చెప్పారు. 


 ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లు శ్రీ హరెందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీమతి రోజ్ మాండ్,  మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్,  డి ఆర్ డి ఎ పి డి శ్రీ సాంబశివ రెడ్డి,  చేనేత జౌళి శాఖ ఎడి శ్రీ ఆనంద్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి ఆనంద కుమారి, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య పలువురు మహిళా సంఘాల సభ్యులు,  లబ్ధిదారులు  పాల్గొన్నారు. 

Comments