రైతాంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ ధ్యేయం

 *రైతాంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ ధ్యేయం*


*: జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ*


పుట్టపర్తి (అనంతపురం), డిసెంబర్ 30 (ప్రజా అమరావతి):


రైతాంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


పుట్టపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.*


ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కొద్దిరోజుల కిందట జిల్లా కేంద్రంలో డిఆర్సి మీటింగ్ నిర్వహించడం జరిగిందని, అందులో సభ్యులంతా భారీ వర్షపాతం కురవడం, దాని వల్ల పంటలు దెబ్బతిన్నాయని, అందులో పప్పుశనగ ఎక్కువగా దెబ్బతిందని, అందుకు పంట నష్టపరిహారం కావాలని అడగడం జరిగిందన్నారు. పప్పు శనగ ప్రత్యామ్నాయంగా ధనియాల పంటను సాగు చేసేందుకు విత్తనాల సబ్సిడీ మీద అందించాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో చర్చించడం జరిగిందని, కేంద్ర బృందం దృష్టికి కూడా నివేదించడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. పప్పుశనగ సాగు చేసేందుకు జనవరి 15 వరకు అవకాశం ఉండడంతో పప్పు శనగ విత్తనాలు కూడా సబ్సిడీ మీద రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ధనియాల విత్తనాలను కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని సభ్యులు కోరడం జరిగిందని, ధనియాల విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి సబ్సిడీ మీద రైతులకు అందిస్తున్నామన్నారు.  రైతులకు ఏం కావాలో, రైతులు ఆర్థికంగా బాగు పడేందుకు, వారిని అభివృద్ధి పథంలో తీసుకు వచ్చేందుకు అవసరమైన మెరుగైన కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులు కోరడం జరిగిందని, ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పుట్టపర్తి లో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు దాతలు ముందుకు రావాలని, స్టేడియం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.


ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మహమ్మద్ ఇక్బాల్, కదిరి, మడకశిర, రాప్తాడు, గుంతకల్లు ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



Comments