సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి

 

అమరావతి (ప్రజా అమరావతి);


*ఉత్తరాంధ్రలో జవాద్‌ తుపాన్‌ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌. సమీక్ష:*

*హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా హాజరు*:


*సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:*


*ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదు. ఒక్క మరణం కూడా సంభవించొద్దు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి*.


*సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచండి*.


*సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి



*.


*సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత చాలా ముఖ్యం. అలాగే మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ నీట్‌గా ఉండాలి. ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి*. 


*అన్ని జిల్లాలలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉండాలి. ఆ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించండి*.


*ఇంకా అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి*.


*ఎక్కడెక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయని భావిస్తే, అక్కడి ప్రజలను ముందుగా గట్టిగా అప్రమత్తం చేయాలి. వారిని తరలించాలి*.


*చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయన్నది చూడండి*.


*ఎక్కడైనా వాటికి గండ్లు పడ్డాయని తెలిసినా లేదా బలహీనంగా ఉన్నాయని గుర్తించినా వెంటనే జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడండి. వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టండి*.


*ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్‌ ముప్పు లేనప్పటికీ, అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి*.


*ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి*. 


*పూర్తిస్థాయిలో అప్రమత్తం: సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ.*


ఉత్తరాంధ్రతో పాటు, ఉభయ గోదావరి జిల్లాలలో ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ వెల్లడించారు. 

ఇప్పటికే 11 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 6 కోస్ట్‌గార్డ్‌ టీమ్‌లు, 10 మెరైన్‌ పోలీస్‌ బృందాలు, 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 18 ఫైర్‌ సర్వీస్‌ టీమ్‌లను ఉత్తరాంధ్ర జిల్లాలలో మొహరించామని ఆయన తెలిపారు. ఇంకా 115 జేసీబీలతో పాటు, మరో 115 టిప్పర్లు కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. 232 నీళ్ల ట్యాంకర్లు, 295 డీజిల్‌ జనరేటర్లు, 46,322 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 1,018 మెట్రిక్‌ టన్నుల పప్పులు, 41,032 లీటర్ల వంటనూనె, 391 టన్నుల పంచదారను ఆయా జిల్లాలకు పంపించామని అన్నారు. 

వీటితో పాటు వైద్య బృందాలు, అవసరమైన ఔషథాలను పంపించడంతో పాటు, లోతట్టు ప్రాంతాలకు చెందిన 54 వేల కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించే విధంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ వివరించారు. 


కాగా, ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమీక్షలో పాల్గొనగా, క్యాంప్‌ కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కోన శశిధర్, పౌర సరఫరాల కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌ నారాయణ్‌ గుప్తా, అదనపు డీజీ ఎ.రవిశంకర్‌ అయ్యన్నార్‌తో పాటు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments