జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేదలకు వరం లాంటిదని, జిల్లాలో అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.

   నెల్లూరు, తే(prajaamaravati);


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేదలకు వరం లాంటిదని, జిల్లాలో అర్హులైన వారు ఈ పథకాన్ని   సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు  పేర్కొన్నారు.




బుధవారం గూడూరు మండల పరిధిలోని  చెన్నూరు 2/1, 2/3 గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు సందర్శించి,   జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించిన  లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను  అందచేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జగనన్న సంపూర్ణ గృహ పథకం పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన  చక్కటి అవకాశమని,  గ్రామ వాలంటీర్లు  గ్రామ సచివాలయ సిబ్బంది  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని  అర్హులందరూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని  సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఈ పథకం ద్వారా  తమ ఇళ్లపై సర్వహక్కులు పొందడమే కాకుండా రిజిస్ట్రేషన్ కలిగిన దస్తావేజు పొందుతారన్నారు. జిల్లాలో ఒక్కరు కూడా మిస్ కాకుండా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకొని  రుణ విముక్తి పొందాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక ప్రాంతాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థ ప్రాంతంలో రూ.20 వేలు ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10 వేల మంది ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని,  మిగిలిన వారు ఈ నెల 20వ తేదీ లోపు అర్హులైన వారు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని  కలెక్టర్ తెలిపారు. ఈ పధకం ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునేలా సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కం అమ‌లును వేగ‌వంతం చేయాల‌ని,  సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను  ఆదేశించారు.  ఈ పధకం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించి, దీనిని స‌ద్వినియోగం చేసుకొనేలా చూడాల‌ని అన్నారు. స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్లు క్షేత్ర‌స్థాయిలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.   సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా పని చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు, సచివాలయానికి వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా  నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో గూడూరు  ఆర్డీవో శ్రీ వి. మురళికృష్ణ, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఖయ్యుం,  గూడూరు మునిసిపల్ కమీషనర్ శ్రీ  బి. శ్రీకాంత్,  గూడూరు తహసీసల్దార్ శ్రీమతి లీలరాణి,  ఎం పీ డీ వో శ్రీమతి నాగమణి,  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులు   తదితరులు పాల్గొన్నారు.


Comments