అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన యునైటెడ్ నేషన్స్‌కు చెందిన పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) బృందం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ప్రతినిధులు.
సీఎం శ్రీ వైయస్.జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్న వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య,
టోమియో షిచిరి, కంట్రీ డైరెక్టర్ (ఇండియా),
పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ) యునైటెడ్ నేషన్స్
ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏ కె సింగ్.
సుస్ధిర వ్యవసాయ–ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడంతోపాటు రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు ఎఫ్‌ఏఓ– ఏపీల మధ్య టీసీపీ(టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు) ఒప్పందం.
అందరికీ ఆహార భద్రతపై అంతర్జాతీయంగా కృషి చేస్తున్న ఏఫ్‌ఏఓ.రాష్ట్రంలో ఆర్బీకేలకు సాంకేతికంగా, ఆర్ధికంగా సాయం అందించనున్న ఏఫ్‌ఏఓరైతుభరోసా కేంద్రాల బలోపేతం చేసేందుకు సహకరించనున్న ఎఫ్‌ఏఓ, ఐసిఏఆర్.వ్యవసాయ అనుబంధరంగాల్లో నూతనంగా వచ్చిన సాంకేతికపరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు శిక్షణ అందించనున్న ఎఫ్‌ఏఓ.
ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతుల్లోనూ రైతులకు శిక్షణ అందించనున్న ఎఫ్‌ఏఓ..ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను వివరించిన సీఎం.
ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం..
గతంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల వాడకం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారన్న సీఎం.
ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆర్బీకేలు వచ్చాయన్న సీఎం.
అలాగే రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నామన్న ముఖ్యమంత్రి.
ఇ– క్రాపింగ్ గురించిన వివరించిన సీఎం.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయరంగంలో పెను మార్పులు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి.
టోమియో షిచిరి, కంట్రీ డైరెక్టర్ (ఇండియా),
పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ) యునైటెడ్ నేషన్స్.
రైతుభరోసా కేంద్రాలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు ప్రతీకలగా నిలిచే సంస్ధలు. ఆర్బీకేలు వ్యవసాయరంగంలో దేశానికే రోల్‌మోడల్.
రైతులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఇన్‌పుట్స్ అందించడంలో
ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబులు మంచి వ్యవస్ధలుగా నిలబడతాయి. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్ వ్యవస్ధ, ఆర్బీకే స్టూడియోల కార్యక్రమాలు రైతులకు ఉత్తమ ఫలితాలు అందించడంలో గొప్ప మేలు చేస్తాయి.
సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ), యునైటెడ్ నేషన్స్ కంట్రీ డైరెక్టర్ (ఇండియా) టోమియో షిచిరి, ఎఫ్‌ఏఓ ప్రతినిధి డాక్టర్ సి కొండా రెడ్డి, సీనియర్ పుడ్ సేప్టీ అండ్ న్యూట్రిషన్ ఆఫీసర్ ధర్మపురి శ్రీధర్, నేషనల్ ఎక్స్‌పర్ట్ ఆన్ అగ్రి సర్టిఫికేషన్ నచికేత్ ఉడుప, నేషనల్ ఎక్స్‌పర్ట్ ఆన్ ఎఫ్‌ఎఫ్‌ఎస్ వై సుధాకర్, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డైరెక్టర్( ఐసిఏఆర్–అటారీ, హైదరాబాద్) డాక్టర్ జే వి ప్రసాద్.
కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి శేఖర్‌బాబు.
addComments
Post a Comment