తుఫాన్ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి భీమిలి మండలం కె.నగరంపాలెం లో పర్యటించారు.

 

విశాఖపట్నం, డిశంబరు 4 (ప్రజా అమరావతి): తుఫాన్ సందర్భంగా జాయింట్ కలెక్టర్   ఎం .వేణుగోపాల రెడ్డి భీమిలి మండలం కె.నగరంపాలెం లో  పర్యటించారు.


అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. మత్స్యకార గ్రామం  సందర్శించి అక్కడి   గ్రామస్థులతో మాట్లాడారు.  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు  వెళ్లాలని సూచించారు.  అనంతరం జాయింట్ కలెక్టర్  గ్రామ సచివాలయాన్ని సందర్శించి  సిబ్బందితో   విధుల నిర్వహణ, రిజిష్టర్ల తనిఖీ చేసారు . గృహ నిర్మాణాలకు సంబందించి  వన్టైమ్ సెటిల్ మెంట్ ఎన్ ట్రోల్ మెంట్  వేగవంతంగా చేయాల్సిందిగా ఆదేశించారు.  సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందించాలన్నారు. 


Comments