వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన.*


*డిసెంబరు 2, 3 తేదీలలో వరద ప్రభావిత వైయస్సార్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*

 

*భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్న ముఖ్యమంత్రి*


*తొలిరోజు వైయస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించనున్న సీఎం*

*నేరుగా బాధిత ప్రజలు, రైతులతో ఇంటరాక్ట్‌ కానున్న సీఎం*

*భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్న సీఎం*

*ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి*

*మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం పర్యటన*


*రెండో రోజూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన* 

*పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంటపొలాలను స్వయంగా పరిశీలించనున్న సీఎం*


*అధికారులతో వరద నష్టం, సహాయ చర్యలపై సమీక్షలు.*


*డిసెంబరు 2న సీఎం పర్యటన ఇలా..*


ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి వైయస్సార్‌ కడప జిల్లా బయలుదేరనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ 


10.50 గంటలకు వైయస్సార్‌ కడప జిల్లా మందపల్లి(రాజంపేట) చేరుకోనున్న సీఎం


అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి


పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్న సీఎం


సహాయశిబిరంలో ఉన్న బాధితులతో సీఎం ముఖామఖి.


మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకోనున్న సీఎం


అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి... గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో  స్వయంగా కాలినడకన  పర్యటించనున్న ముఖ్యమంత్రి 


ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్లనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలించినున్న సీఎం

వరద ప్రభావం ఫలితంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టం పై సీఎంకు వివరాలందించనున్న అధికారులు


మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం

సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి 


అక్కడ నుంచి రేణిగుంట మండలం వేదలచెరువు,  ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని, కాలనీ ప్రజలతో వరదనష్టంపై ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్న సీఎం


4.30 గంటలకు ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి

పాపనాయుడుపేటలో వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్న సీఎం


అక్కడ నుంచి తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్లనున్న సీఎం

వరద నష్టంపై బాధితులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి


అనంతరం పద్మావతి అతిధి గృహం, తిరుపతి చేరుకోనున్న ముఖ్యమంత్రి

సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం


రాత్రి పద్మావతి అతిధి గృహంలో బసచేయనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


*డిసెంబరు 3 వ తేదీన చిత్తూరు, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


డిసెంబరు 3వ తేదీ ఉదయం తిరుపతి, కృష్ణానగర్‌లో పర్యటించి, వరద నష్టాన్ని పరిశీలించడంతో పాటు స్ధానికులతో ముఖాముఖి.


వరద ప్రభావం గురించి తెలుసుకోనున్న  సీఎం

అక్కడ నుంచి ఆటోనగర్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి


అనంతరం ఉదయం 11 గంటలకు ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా బయలుదేరి వెళ్లనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

నెల్లూరు రూరల్, దేవరపాలెం చేరుకుని, అక్కడ భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్డును, దెబ్బతిన్న వ్యవసాయ పంటలను పరిశీలించనున్న సీఎం


ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామానికి వెళ్లనున్న సీఎం వైయస్‌.జగన్‌

పెన్నానదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను పరిశీలించనున్న సీఎం 

అక్కడ నుంచి పెనుబల్లి జొన్నవాడ చేరుకుని, వరద ధాటికి కొట్టుకుపోయిన ఆర్‌ అండ్‌ బి రహదారిని, పంచాయతీరాజ్‌ రోడ్లతో పాటు ఇసుక మేటలు వేసిన వరిపొలాలను స్వయంగా పరిశీలించనున్న సీఎం


భారీ వర్షాలకు పంటలు, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం ముఖాముఖి


మధ్యాహ్నం 1.15 గంటలకు నెల్లూరు నగరపాలక సంస్ధ పరిధిలో భగత్‌ సింగ్‌ కాలనీకి చేరుకోనున్న సీఎం

వరద ప్రభావంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న ముఖ్యమంత్రి


అక్కడ నుంచి దర్గామిట్ట, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్న సీఎం

అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరద నష్టంపై సీఎం ఇంటరాక్షన్‌


అనంతరం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం


తిరిగి 4.20 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లి వెళ్లనున్న  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.