శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
రోో ఆలయ పాలకమండలి ఛైర్మన్ గారి కార్యాలయం నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గాా మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ ది.25-12-2021 నుండి ది.29-12-2021 వరకు జరుగు భవానీ దీక్షా విరమణ ఉత్సవములు సందర్భంగా భవానీ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నందు చేసిన ఏర్పాట్లు, హోమగుండం ఏర్పాటు, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు, మాలా విరమణ తదితర ఏర్పాట్లు గురించి గురు భవానీ దార్లతో చర్చించడమైనది.
ఈ సమావేశం నందు ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్ , పలు ప్రదేశములుకు చెందిన గురుభవానీ లు పాల్గొన్నారు.
addComments
Post a Comment