*"ఓ.టి.యస్.పై అపోహలొద్దు" - కాకాణి
*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారుల సమక్షంలో గ్రామాల వారీగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యలు తెలుసుకొని, పరిష్కరించవలసిందిగా కోరిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నాం.
గ్రామాల వారీగా అధికారుల సమక్షంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహిస్తున్న సమీక్షలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
అధికారులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత చిత్తశుద్ధితో పని చేయవలసిన అవసరం ఉంది.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓ.టి.యస్.) ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది.
ఓ.టి.యస్. పథకం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా తమ గృహాలపై హక్కు పొందేందుకు అవకాశం కల్పించడం కోసం ఉద్దేశించిన పథకం తప్ప, మరొకటి కాదు.
అమరావతి రైతుల ముగింపు సభలో చంద్రబాబు పాల్గొనడంతో అమరావతి సభ కాస్త, తెలుగుదేశం పార్టీ సభే అన్న నిర్ధారణ అయ్యింది.
అమరావతి కోసం పేద రైతుల యాత్ర అని వందల కోట్లు వెచ్చించి, యాత్ర నిర్వహించడంతోపాటు, అట్టహాసంగా నిర్వహిస్తున్న ముగింపు సభ చూస్తుంటే చంద్రబాబు హస్తం స్పష్టంగా కనిపిస్తుంది.
పేద రైతుల పేరిట చంద్రబాబు తన బినామీ భూములు కాపాడుకోవడం కోసం, అమరావతి ప్రాంత భూస్వాములు తమ భూముల రేట్లు రాబట్టుకోవడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి యాత్రలు, సభలు నిర్వహించే శక్తి, స్తోమత పేదరైతులకు ఉండే అవకాశం లేదు కాబట్టి, ఇది చంద్రబాబు, అమరావతి ప్రాంత ధనికుల పన్నాగమే అని ప్రజలకు అర్థమైంది.
చంద్రబాబు అమరావతి కోసం సభలు, సమావేశాలు తలపెట్టడంతో, మరోవైపు వికేంద్రీకరణ కోరుకుంటూ, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని విద్యార్థులు, మేధావులు పోరుబాట పట్టారు.
చంద్రబాబు ఆలోచనలన్నీ రాష్ట్రంలో శాంతి, సామరస్యాలు కాపాడుకునే విధంగా కాకుండా, శాంతి,భద్రతలకు భంగం వాటిల్లే విధంగా కార్యకలాపాలకు పూనుకుంటున్నాడు.
చంద్రబాబు చేస్తున్న అనేక ప్రచారాలను ప్రజలు వదంతులుగా భావిస్తున్నారు తప్ప, వాస్తవాలు కాదు అనే నిర్ణయానికి వచ్చేశారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు చెందిన అన్ని సమస్యలపై దృష్టిపెట్టి, పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తాం.
addComments
Post a Comment