ఏపిఐసి - న్యూఢిల్లీ – డిసెంబర్ 20 (ప్రజా అమరావతి);
ఏ.పి భవన్ మాజీ పీ.ఆర్.సీ అభయ్ త్రిపాఠి మృతి స్మృత్యర్థం సంతాప సభ
ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పి. ఆర్. సి) అభయ్ త్రిపాఠి మృతి స్మృత్యర్థం సంతాప సభను భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ రోజు సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.పి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా, స్పెషల్ కమిషనర్ ఎన్. వి. రమణా రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సంజయ్ జాజు (ఐ. ఏ. ఎస్), ఏ. పి మరియు తెలంగాణ భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
సుమారు 11 సంవత్సరాలు ఏ.పి భవన్ కు తన అమూల్య సేవలనందించిన అభయ్ త్రిపాఠి డిసెంబర్ 17 (శుక్రవారం) రాత్రి హైదరాబాద్ లో మరణించారు.
ఈ సందర్భంగా ఏ.పి భవన్ పి. ఆర్. సి భావ్నా సక్సేనా మాట్లాడుతూ స్నేహశీలి, అత్యంత ప్రతిభావంతుడైన అభయ్ త్రిపాఠి లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన కుటుంబానికి తన సానుభూతి, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైనవారందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించారు.
addComments
Post a Comment