శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము,ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
దేవస్థానము నందు ది.25.12.2021 నుండి ది.29.12.2021 వరకు నిర్వహించు భవానీ దీక్షలు – 2021ను పురస్కరించుకొని చేపట్టవలసిన వివిద రకముల నిర్వహణా ఏర్పాట్లు మరియు దీక్షల విరమణకు విచ్చేయు దీక్షాధారులకు,భక్తులకు కల్పించవలసిన మౌలిక వసతుల గురించి ఆలయ కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ దేవస్థానం నందు అన్ని విభాగముల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది.
అనంతరం ఛైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వార్ల చేతుల మీదుగా దేవస్థానం యొక్క 2022 సంవత్సరపు క్యాలండర్ ను ఆవిష్కరించడం జరిగినది.
ఈ సమావేశం నందు ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి ,కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్ , ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వార్లు, సహాయ కార్యనిర్వాహనాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment