కొవ్వూరు (ప్రజా అమరావతి);
కొవ్వూరు మండల ప్రజా పరిషత్తు రెండవ ఉపాధ్యక్షురాలు పదవికి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్.పి.టి.సి. (పసివేదల -1) నూతంగి రేఖ.
కొవ్వూరు ఎంపిడిఓ కార్యాల యంలో మంగళవారం కొవ్వూరు మండల ప్రజా పరిషత్తు కి జరిగిన రెండవ ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతంగి రేఖ ప్రమాణ స్వీ కారం చేసారు. కార్యక్రమానికి యం.పి. పి. కాకర్లనారాయుడు ( సత్యనారాయణ), వైస్ యం.పి.పి. వీరమల్లు నారాయుడు సమక్షంలో ఎన్నికల ప్రత్యేకాధికారి వ్యవసాయ శాఖ ఎడిఏ పి. చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నూతంగి రేఖ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ న్ రెడ్డి ప్రభు త్వం అందిస్తున్న అమలు చేస్తు న్న సంక్షేమ కార్యక్రమాలు మా విజయానికి కారణం అన్నారు. ప్రజలకు చేరవేయ్యడంలో నిబద్ధతతో పని చేస్తానన్నారు. ప్రజల ఆకాంక్షలు మేరకు ప్రజల కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో డి.ఎల్.డి.ఓ, పి. జగదాంబ, జడ్పీటీసి బొంతా వెంకట లక్ష్మీ, పలువురు ఎంపిటిసిలు, ఇతర నాయకులు, ప్రజా ప్రతి నిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment