ఎపి కేడర్ 1992 బ్యాచ్ కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి.

 ఎపి కేడర్ 1992 బ్యాచ్ కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు  ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి.

అమరావతి,1జనవరి (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ కేడర్ 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులకు ఎబౌవ్ సూపర్ టైం స్కేల్ ఎపెక్స్ స్కేల్ తో  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సిఇఒ) మరియు ఎక్స్ అఫీసియో ముఖ్య కార్యదర్శి గా పనిచేస్తున్న కె.విజయా నంద్,రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్,రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బి.రాజశేఖర్లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య :2247 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. పైముగ్గురు అధికారులు ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న పోస్టుల్లోనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా  కొనసాగుతారని సిఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.