Nelluru (prajaamaravati),
వై.యస్.ఆర్.పింఛను కానుక రూ. 2,500 కు రాష్ట్ర ప్రభుత్వం పెంపుదల
చేసిందని, రాష్ట్రంలో 61.75 లక్షల మందికి రూ.1570 కోట్లు ప్రతి నెల వై.యస్.ఆర్ పింఛను కానుకగా అందించడం జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. అనిల్ కుమార్ అన్నారు.
వైఎస్సార్ పింఛన్ కానుక కింద పింఛన్ల లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ. 2,500 పెంపుదల కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. అనిల్ కుమార్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర బాబు పాల్గొని ఫించన్ దారులకు వైఎస్సార్ పింఛన్ కానుకను అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి డా. అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నారని అన్నారు. ఇచ్చిన మాటను తప్పకుండా వైఎస్సార్ పింఛన్ కానుక కింద పింఛన్ల లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ. 2,500 పెంపుదలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరిగిదన్నారు. గత ప్రభుత్వం పింఛన్ల క్రింద నెలకు 400 కోట్లు ఖర్చు చేయగా, నేడు నెలకు 1570 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి డా. అనిల్ కుమార్ తెలిపారు. గతంలో పింఛన్ల కొరకు గంటల తరబడి, రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, నేడు వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తేదీ ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి డా. అనిల్ కుమార్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి అవ్వా తాతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి డా. అనిల్ కుమార్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతి హామీని అంచెలంచెలుగా అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే ప్రమాణస్వీకారం సందర్భంగానూ పింఛన్ పైనే ముఖ్యమంత్రిగా శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తొలి సంతకం చేశారని మంత్రి శ్రీ మేకపాటి గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఖురాన్,బైబిల్, భగవద్గీతలుగా భావించి వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపును 2022 కొత్త ఏడాది సందర్భంగా ప్రారంభించి అవ్వ,తాతల మోములో చిరునవ్వుల పువ్వులు పూయిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా సంక్షేమం, సంస్కరణలు, సరైన నిర్ణయాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం జగన్ మరింత ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఏ పని చేయలేని వృద్ధులకు సామాజిక బాధ్యత పింఛన్ ఇవ్వడం , ఆ మొత్తాన్ని పెంచడం వల్ల వారికి అండగా నిలవడంతో పాటు, ప్రజాప్రతినిధులైన మాలాంటి వారికీ గౌరవం అభిస్తోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా తరపున ముఖ్యమంత్రికి మంత్రి మేకపాటి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి అన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల కార్యక్రమాన్ని అమలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. అందులో భాగంగా ఈ రోజు వైఎస్సార్ పింఛన్ కానుక కింద పింఛన్ల లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ. 2,500 పెంపుదల చేయడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి అరుణమ్మ అన్నారు.
1. నెల్లూరు నగరం, చిన్న బజారుకు చెందిన శ్రీ కారని షణ్ముఖం, వైఎస్సార్ పింఛన్ కానుక లబ్ధిదారులు : తన అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, గతంలో పింఛన్లు కొరకు ఎంతో ఎదురు చూచే పరిస్థితి ఉండేదని, నేడు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీనే ఇంటివద్దకే పింఛన్ అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.
2. నెల్లూరు నగరం, చాకలివారివీధి కి చెందిన శ్రీమతి వీరకందువారి సెల్వి, వైఎస్సార్ పింఛన్ కానుక లబ్ధిదారులు : తన అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని పెంచడం ఎంతో సంతోషంగా వుందని, ఈ పింఛన్ డబ్బులు తమకు కొండంత అండగా ఉపయోగపడుతున్నాయని, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఆత్మాభిమానంతో జీవించుటకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీ పి. రూప్ కుమార్, జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విధేహ్ ఖరే, నెల్లూరు మునిసిపల్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి రోజ్ మాండ్, డి.ఆర్.డి.ఎ పి.డి శ్రీ సాంబశివా రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైఎస్సార్ పింఛన్ కానుక లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment