టెలీ స్పందనకు 54 వినతులు
విజయనగరం, జనవరి 24 (ప్రజా అమరావతి): సోమవారం జరిగిన టెలీ స్పందనకు 54 వినతులు వచ్చాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నేపద్యంలో ఈ వారం కూడా స్పందన కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా సదరం పింఛన్లుకు సంబంధించి వినతులు రావడం జరిగిందని సంబంధిత శాఖల అధికారులతో సత్వరపరిష్కార నిమిత్తం ఆదేశించడం జరిగిందన్నారు. టెలీ స్పందనలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు, పింఛన్లు,హౌసింగ్,సదరం సర్టిఫికేట్స్,ధాన్యం కొనుగోలు తదితర సమస్యలపై ఫోన్ కాల్స్ వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
టెలి స్పందనలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా మహేష్ కుమార్ ,డీపీఎం పద్మావతి హాజరయ్యారు.
addComments
Post a Comment