సర్వేపల్లి నియోజకవర్గంలో 5మండలాల్లో ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం.

 *"సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికైన నూతన మండల పరిషత్ ఉపాధ్యక్షులు".**సర్వేపల్లి నియోజకవర్గంలో 5మండలాల్లో ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం.**శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం, మనుబోలు మండలాల్లో నిర్వహించిన మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలలో పాల్గొని, మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


*వెంకటాచలం మండలం: శ్రీమతి మందల మస్తానమ్మ*


*మనుబోలు మండలం: శ్రీమతి గుండాల చందన*


*పొదలకూరు మండలం: శ్రీమతి సోమా అరుణ*


*తోటపల్లి గూడూరు మండలం: శ్రీమతి కంజీ నీలమ్మ*


*ముత్తుకూరు మండలం: శ్రీమతి అక్కయ్యగారి జయలక్ష్మి*


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, మండల అధ్యక్ష పదవులలో అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాం.


 మండల పరిషత్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బి.సి.,ఓ.సి, మైనారిటీలతోపాటు మహిళలలకు కూడా 50 శాతంకు తగ్గకుండా అవకాశం కల్పించాం.


 జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలని స్థానిక సంస్థలకు రెండేసి చొప్పున ఉపాధ్యక్షుల నియామకానికి చట్టంలో మార్పులు తీసుకొనివచ్చారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలకు ఉపాధ్యక్షులుగా 5 మందిని వెనుకబడిన తరగతులకు (బి.సి.సామాజికవర్గానికి) చెందిన మహిళలను ఎంపిక చేశాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఉపాధ్యక్ష పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఎంపీటీసీ సభ్యులకు, స్థానిక నాయకులకు నా ధన్యవాదాలు.


 మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నిక కార్యక్రమాన్ని సజావుగా, సాఫీగా నిర్వహించిన అధికారులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన 5 మంది ఉపాధ్యక్షులకు నా అభినందనలు.