ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మరియు నెట్‌వర్కింగ్‌ అనే అంశం పై అంతర్జాతీయ సదస్సు

 తాడేపల్లి (ప్రజా అమరావతి);       కె.ఎల్.విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్( ఈసిఎమ్) ఆధ్వర్యంలో మార్చి 18 నుంచి 19 వరకు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మరియు నెట్‌వర్కింగ్‌ అనే అంశం పై అంతర్జాతీయ సదస్సు


నిర్వహిస్తున్నామని ఈసీఎం విభగదీపతి డాక్టర్ శివ గంగ ప్రసాద్ తెలిపారు. సదస్సుకి సంబంధించిన గోడ పత్రికను విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ శనివారం ఘనంగా ఆవిష్కరించారు. సదస్సు యొక్క రిజిస్ట్రేషన్ మరియు పత్రముల సమర్పణ జనవరి 31 లోపు చేసుకోవాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం icrtisn2022@kluniversity.in నుంచి తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీఎం విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments