జగన్ రెడ్డి పాలనతో ఎక్కువ నష్టం రాష్ట్ర యువతకే... వారి భవిష్యత్ ను వైసీపీ కాలరాసింది

 *యువతకు టిడిపి అధినేత చంద్రబాబు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు*


*స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన చంద్రబాబు.*.


*రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు, ఉపాధి అని చెప్పిన జగన్ ను ఈ రోజు యువత నిలదీయాలన్న చంద్రబాబు*


*జగన్ రెడ్డి పాలనతో ఎక్కువ నష్టం రాష్ట్ర యువతకే... వారి భవిష్యత్ ను వైసీపీ కాలరాసింది


*


*మహనీయుని స్ఫూర్తితో అసమర్థ, అవినీతి పాలనపై యువత పోరాడాలని చంద్రబాబు పిలుపు*


అమరావతి (ప్రజా అమరావతి): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉండల్లిలోని తన నివాసంతో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డే గా జరుపుకుంటున్న సందర్భంగా  ఆ మహనీయుని స్మృతికి నివాళి అర్పిస్తూ...యువతకు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడినట్లే....నిత్యం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుందన్న సందేశం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. లేవండి...కదలండి...గమ్యం చేరే వరకు ప్రయత్నం ఆపకండి అనే వివేకానందుని మాటతో రాష్ట్రంలో అరాచక పాలనపై యువత పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


వైసిపి ప్రజా వ్యతిరేక పాలనతో యువత భవిష్యత్ అంథకారం అయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక రాష్ట్రం లో 358 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం 5 ఏళ్ల పాలనలో యువత భవితకు భరోసా ఇచ్చేలా.... వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉఫాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రత్యక్ష్యంగా... పరోక్షంగా 5 ఏళ్ల కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి 17591 ఉద్యోగాలు ఇస్తే.....ప్రతి ఏటా డీఎస్సీ జరుపుతామని చెప్పిన జగన్‎‎ రెడ్డి కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతిఇస్తే జగన్ రెడ్డి  రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారు. నాడు ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల విప్లవం అన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ , నాసికరం మద్యానికి నిలయంగా మార్చి యువత భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారని అన్నారు. ‎యువత తలచుకుంటే దేన్నైనా సాధించవచ్చన్న స్వామి వివేకానంద స్పూర్తితో వైసీపీ అసమర్ద, అవినీతి, అరాచక పాలనపై యువత పోరాటం చేయాలని చంద్రబాబు నేషనల్ యూత్ డే సందర్భంగా పిలుపునిచ్చారు.