- సేద్య విభాగంలో పులగం తిషిగ్నారెడ్డి ఎడ్ల జతకు ప్రథమస్థానం
- ద్వితీయ, తృతీయ స్థానాల్లో గుంటూరు జిల్లా ఎడ్ల జతలే
- విజేతలకు రూ.2.70 లక్షల నగదు బహుకరణ అందజేసిన అడపా, పాలేటి, గొర్ల తదితరులు
గుడివాడ, జనవరి 14 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీల్లో భాగంగా జరిగిన సేద్య విభాగంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన పులగం తిషిగ్నారెడ్డి ఎడ్ల జత ప్రథమస్థానంలో నిలిచింది. ఈ జత నిర్ణీత సమయంలో 4,609.99 అడుగుల మేర బండను లాగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే గుంటూరుకు చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్ల జత 4,500 అడుగుల మేర బండను లాగి రెండవ స్థానాన్ని, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరుకు చెందిన తోట శ్రీనివాసరావు ఎడ్ల జత 4,485 అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో, కృష్ణాజిల్లా కళ్ళంవారి పాలేనికి చెందిన కళ్ళం అనూషారెడ్డి, మనోజెడ్డిల ఎడ్ల జత 4,424.11 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానంలో, ప్రకాశం జిల్లా ఉప్పుమాగులూరుకు చెందిన పల్లేల సుధాకర్ రెడ్డి ఎడ్ల జత 4,347.3 అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో, గుంటూరు జిల్లా పాపాయిపాలేనికి చెందిన కందుల రాజ్యలక్ష్మి ఎడ్ల జత 4,266.4 అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని, హైదరాబాద్ కు చెందిన డీ రోహన్ బాబు ఎడ్ల జత 3,300 అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని, కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన బావినేని ధార్మిక్ రామ్ చౌదరి, ఆకర్ష్ చౌదరి ఎడ్ల జత 3,145.6 అడుగుల దూరాన్ని లాగి ఎనిమిద స్థానాన్ని , తెలంగాణా రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ చెందిన యెల్పల ప్రసన్నరెడ్డి ఎడ్ల జత 3 వేల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ .45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు, రూ.10 వేల నగదు బహుమతులను మున్సిపల్ మాజీ వైసైచైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఉపాధ్యక్షుడు చింతల భాస్కరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైసీపీ నేత రేమల్లి పసి తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, ఆర్వీఎల్ నరసింహారావు , షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment