సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చింది

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికామెంట్స్*


*టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారు*


*సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చింది*



 *అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాను*


*రెండువైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు*


*కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారు*


*సినీ పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నాను అని సీఎం చెప్పారు*


*ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు*


*సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నామని చెప్పారు*


*సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చా* 


*త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు*


*ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు*


*సినిమా పరిశ్రమలో ని వ్యక్తులు ఎవరూ లేని పోనీ కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా*


*పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా*


*రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.*


*త్వరలోనే కమిటీ సమావేశానికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తాం*

Comments