సంక్షేమం ఆగదు..పరిశ్రమల ప్రవాహం తప్పదు

 ఆత్మకూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


సంక్షేమం ఆగదు..పరిశ్రమల ప్రవాహం  తప్పదు
ఆత్మకూరులో పెరిగిన పింఛన్ ను అందజేసిన మంత్రి గౌతమ్ రెడ్డి.


వితంతు మహిళలు, వికలాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, వృద్ధులు కూడా ఎవరిపై ఆధారపడని విధంగా పింఛన్ల పంపిణీ.


వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రతి నెలా ఇంటికే పింఛన్లు అందించడం ఓ మలుపు.


గతంలో ఎన్నడూ ఇవ్వనంత మందికి పింఛన్లు అందించే ప్రభుత్వం మనదే.


పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి చలించి వాటిని తొలగించాలన్న తపనతో నవరత్నాలను తీసుకువచ్చారు


నెలకు రూ.1570కోట్లు, ఏడాదికి రూ.20వేల కోట్లు పింఛన్ల పంపిణీకే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.


రాష్ట్రంలో 60 లక్షల మందికి పింఛన్లు, ప్రతి ఒక్కరి బాధ్యతను తానే తీసుకునేంతలా మొత్తంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ.


అవ్వతాతల బాగోగులను సీఎం చూసుకుంటారు...మీ మనుమలు, మనుమరాళ్ల భవిష్యత్ గురించి నేను చూసుకుంటా.


రూ.25 కోట్లతో నారంపేట ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు అభివృద్ధి.


ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో పరిశ్రమలను క్యూ కట్టిస్తాం.


ఆత్మకూరు పట్టణం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో మంత్రి మేకపాటి.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు ఆర్డిఓ చైత్రవర్షిణి, ఎంపిపి వేణుగోపాల్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, అధికారులు.