అక్షర చైతన్యం కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులకు నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి.


నెల్లూరు, జనవరి 8 (ప్రజా అమరావతి) : జిల్లా వ్యాప్తంగా అక్షర చైతన్యం కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులకు నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి.


జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన పలు పరీక్షా కేంద్రాలను  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి, డిఇఓ శ్రీ రమేష్ కుమార్, వయోజన విద్య రాష్ట్ర సంచాలకులు శ్రీమతి  షకీరా బేగం, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, అభ్యాసకుల హాజరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. 

  శనివారం ఉదయం జిల్లా వ్యాప్తంగా 1746 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా పొదలకూరు మండల పరిధిలోని ఉలవరపల్లి ప్రాథమిక పాఠశాల, పొదలకూరు దువ్వూరు నారాయణరెడ్డి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, డి పి ఓ శ్రీ ధనలక్ష్మి, డీఈవో శ్రీ రమేష్ కుమార్ తనిఖీ చేశారు. పొదలకూరు మండల పరిధిలోని మరుపూరు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, చిల్లకూరు జడ్పీ హైస్కూల్లో  ఏర్పాటుచేసిన కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్ తనిఖీ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 1,33,000 మంది అభ్యాసకులకు గాను ఒక లక్ష ఆరు వేల మంది అభ్యాసకులు పరీక్షలు రాశారు. రాత్రి 9 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. 


Comments