నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లాలో పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి పటిష్టమైన చర్యలు
తీసుకోవాలని ఇంచార్జీ జిల్లా కలెక్టర్ శ్రీ హరెంధిర ప్రసాద్, అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో “ సఫాయి కరంచారుల వ్యవస్థ నిషేధం మరియు వారి పునరావాస చట్టం -2013 ” అమలుపై ఇంచార్జీ జిల్లా కలెక్టర్ శ్రీ హరెంధిర ప్రసాద్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జీ జిల్లా కలెక్టర్ శ్రీ హరెంధిర ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్నీ మున్సిపాలిటిల్లో మరియు పంచాయాతీల్లో సఫాయి కరంచారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడంతో పాటు పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్నీ సంక్షేమ కార్యక్రమాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఇంచార్జీ జిల్లా కలెక్టర్ శ్రీ హరెంధిర ప్రసాద్, డివిజనల్ అధికారులను, మున్సిపల్ కమీషనర్స్ ను ఆదేశించారు. యంత్ర పరికరాలతో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించేలా పారిశుధ్య కార్మికులకు అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండల, డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికులకు తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు.
నెల్లూరు మున్సిపల్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్ మాట్లాడుతూ, కొర్పోరేషన్ పరిధిలో సఫాయి కరంచారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి వారి స్థానంలో యంత్రాల ద్వారా అపరిశుభ్ర మలినాలను శుభ్రం చేయడం జరుగుతున్నదని తెలిపారు. నగర కొర్పోరేషన్ పరిధిలో యంత్రాల ద్వారా పనిచేయుచున్న పారిశుధ్య కార్మికులకు లైసెన్స్ లు మంజూరు చేసి సెప్టిక్ ట్యాంకులను శుభ్ర పరుచుటకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్ తెలిపారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి యంత్ర పరికరాలతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్ వివరించారు.
తొలుత సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీ చెన్నయ్య, జిల్లాలో పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు మరియు గత జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు గురించి వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆసరా శ్రీమతి రోజ్ మాండ్, నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ఆర్.డి.ఓ లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ మురళీకృష్ణ, శ్రీ శీనా నాయక్, శ్రీమతి సరోజిని, డ్వామా పి.డి. శ్రీ తిరుపతయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు శ్రీ చిన్నయ్య, శ్రీ ఆరోగ్య స్వామి పుష్పరాజు, శ్రీమతి వెంకట రమణమ్మ, మునిసిపల్ కమీషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment