పెన్షన్లను పెంచారు.. పండుగ తెచ్చారు

 


*పెన్షన్లను పెంచారు.. పండుగ తెచ్చారు*


*వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఇకపై ప్రతి నెలా 2,500 రూపాయల చొప్పున పింఛన్ల పంపిణీ*


*: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి*


*: రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పెన్షన్ లబ్ధిదారులు*


అనంతపురం, జనవరి 01 (ప్రజా అమరావతి)


:


*రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక కింద అందిస్తున్న పెన్షన్లను నూతన సంవత్సర కానుకగా 2,250 నుంచి 2,500 రూపాయలకు పెంచడంతో పెన్షన్ లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా జగనన్న ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోంది. గత నెల ఒకటవ తేదీన గడప ముందుకు వచ్చి తలుపు తట్టి పండుటాకులకు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. దశలవారీగా పెన్షన్లను మూడు వేల రూపాయల వరకు పెంచుతామని పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పెన్షన్లను జనవరి ఒకటో తేదీ నుంచి 2,500 రూపాయలకు పెంచడం జరిగింది. దీనితో అవ్వాతాతలు, వితంతువులు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు లబ్ధి చేకూరింది. జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ప్రతినెలా 5,23,986 మంది లబ్ధిదారులకు 135 కోట్ల రూపాయల మేర పంపిణీ చేయడం జరుగుతోంది. జిల్లాలో 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచిన పెన్షన్ లు 4,34,588 మందికి లబ్ధి చేకూరుతుండగా, కొత్తగా ఈ నెల నుంచి 12,577 మందికి పెన్షన్ లను పంపిణీ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెంచిన పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.*


*1. తలుపు తట్టి ఇస్తున్నారు.*

*: కె.వేణమ్మ, విద్యుత్ నగర్, అనంతపురం టౌన్.*


ప్రతినెలా ఒకటో తేదీన తెల్లవారిన వెంటనే ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు. జనవరి ఒకటవ తేదీ నుంచి ఇంతకుముందు ఇస్తున్న 2,250 రూపాయల పెన్షన్ డబ్బులను 2,500 రూపాయలకు పెంచి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. నా వయసు 65 ఏళ్లు. నేను దరఖాస్తు చేసుకున్న నెల రోజులకే పెన్షన్ వచ్చింది. మాకు బియ్యం కూడా నెల నెలా 10 కేజీలు వస్తున్నాయి. డబ్బులతో నేను నాకు అవసరమైన మందులను తెచ్చుకుంటున్నాను. ముసలివాళ్లకు పెన్షన్ డబ్బులు ఇస్తూ అండగా నిలబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాను.


*2. రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు*

*: బి.జి. సుబ్రహ్మణ్యం, జీసస్ నగర్, అనంతపురం టౌన్.*


నా వయసు 68 ఏళ్లు. వయసు అయిపోయిన మాలాంటి వాళ్లకు పెన్షన్ డబ్బులను ప్రతినెల వాలంటీర్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ ను 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచి అందించారు. నేను కన్న పిల్లలే మమ్మల్ని ఆదుకోలేని పరిస్థితుల్లో చాలా పెద్ద మనసుతో పెన్షన్ అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో గొప్పవారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. మా లాంటి పేదవారిని ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు.


*3. ఆర్థికంగా ఆదుకుంటున్నారు.*

*: వెంకటలక్ష్మి, ఒంటరి మహిళ, అరవింద నగర్, అనంతపురం టౌన్.*


నేను ఒంటరి మహిళను. భర్త లేని నాకు ఒంటరి మహిళ కింద 2,250 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ పెంచి 2,500 రూపాయలు అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. మా అమ్మాయికి అమ్మఒడి కింద లబ్ధి కలిగింది. దీంతో మా అమ్మాయిని చదువుకుంటున్నాను. నాకు ఇంతకు ముందు పెన్షన్ వచ్చేది కాదు.. అయితే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ వస్తోంది. దీంతో మాకు అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అలాంటి నిరుపేద ఒంటరి మహిళలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Comments