సచివాలయానికి వస్తున్న ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన సేవలు అందించాలి

 సచివాలయానికి వస్తున్న ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన సేవలు అందించాలి*


*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*


*: హిందూపురం అర్బన్ లోని 1, 33వ వార్డు సచివాలయాలను జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ తో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


 హిందూపురం, జనవరి 12 (ప్రజా అమరావతి) : 


*సచివాలయానికి వస్తున్న ప్రజలకు నమ్మకం కలిగేలాసచివాలయ ఉద్యోగులు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని కొట్నూరు ఎస్సి కాలనీలో ఉన్న 1వ వార్డు, 33వ వార్డు సచివాలయాలను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్ తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల సమస్యలతో సచివాలయానికి వస్తున్న ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలు అందించాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాల పోస్టర్ లు కనిపించేలా ప్రదర్శించాలన్నారు. సచివాలయం పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లిన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా చెత్త సేకరణ చేపట్టాలని, వేస్ట్ సెగ్రిగేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూలు లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్టైమ్ సెటిల్మెంట్, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, వన్టైమ్ సెటిల్మెంట్ సర్వే పూర్తి చేయాలని, పేదలందరికీ ఇల్లు కింద గ్రౌండింగ్ జరిగిన ఇళ్లను ఈ నెలాఖరులోపు బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న జగనన్న కాలనీలో వెంటనే అన్ని రకాల వసతి సదుపాయాలను కల్పించాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు అంతా జాగ్రత్తగా పనిచేసి ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి చేరువ చేయాలన్నారు. కస్టమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను సక్రమంగా చేపట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. వాలంటీర్ల కూడా వారంలో మూడు రోజులు అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. సచివాలయం పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కి సంబంధించి పెండింగ్ ఉన్న రెండవ డోస్ వెంటనే పూర్తి చేయాలని, ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయాలన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు వాడాలని, భౌతిక దూరం పాటించాలని తెలియజేయాలన్నారు. సచివాలయంలో కోవిడ్ పోస్టర్లు, టోల్ ఫ్రీ నెంబర్లు, సచివాలయ సిబ్బంది వివరాలు, ప్రభుత్వ పథకాల పోస్టర్లు, కోవిడ్ ఆస్పత్రుల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.*


*ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ శ్రీనివాసులు, హౌసింగ్ ఎఈ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున, శివ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.*



Comments