కొల్లిపర (ప్రజా అమరావతి); భారతదేశంలో పండే పసుపు పంటకు ఇతర దేశాల్లో సైతం మంచి మార్కెట్ ఉందని డాక్టర్ వై.ఎస్.ఆర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డా. శారద చెప్పారు. మండల కేంద్రం కొల్లిపరలోని పాల కేంద్రంఉత్పత్తిదారుల కళ్యాణ మండపంలో గురువారం జాతీయ సుస్థిర సుగంధ ద్రవ్యాల సాగు కార్యక్రమాన్ని నీలగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో నిర్వహించారు. పసుపు పంటలో సమగ్ర సస్యరక్షణ సాగు అనంతరం చర్యలపై అవగాహన కల్పించారు. నీలగిరి ఫౌండేషన్ సీఈఓ, ఏ. రఘ రామి రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ డా||గిరిధర్ మాట్లాడుతూ అధిక
కుర్క్ మిన్ కలిగిన పసుపు రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలని సూచించారు. సీనియర్ సైంటిస్ట్లు రజనీ, తనుజ లు మాట్లాడుతూ పసుపు సాగు అనంతరం చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. రసాయనిక మందులు తగ్గిస్తూ జీవన ఎరువుల ప్రాముఖ్యతను గుర్తించి బయోడైవర్సిటీ పద్ధతులు పాటించి మేలైన దిగుబడులు పొందాలని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఏవో సాయి బాబు, అభ్యుదయ రైతులు కళ్ళం. వీరా రెడ్డి, డైరెక్టర్ కుటుంబ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ. ఐ.ఎస్ బి ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా జీవన ఎరువులను అందజేశారు.
addComments
Post a Comment