నూతన సంవత్సరం లో రాష్ట్రంలో ని ప్రజలందరూ సుఖః సంతోషాలతో ఉండాలి

 


కొవ్వూరు (ప్రజా అమరావతి); 


నూతన సంవత్సరం లో రాష్ట్రంలో ని ప్రజలందరూ సుఖః సంతోషాలతో ఉండాలని,


రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోభివృద్ధి సాధించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


శనివారం నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివొచ్చి మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.


మంత్రి వర్యులు శ్రీమతి తానేటి వనిత, డా.శ్రీనివాస్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో  జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్, పోసిన శ్రీలేఖ, ఎం. పి. పి. కాకర్ల సత్యనారాయణ (నారా యుడు), వైస్ యం. పి. పి. వీరమళ్ళ నారాయుడు ,  జెడ్. పి. టి. సి. బొంతా వెంకట లక్ష్మి,  ఆర్డీవో ఎస్.మల్లిబాబు, డిఎస్పీ బి.శ్రీనాధ్, తహసీల్దార్ నాగరాజు నాయక్, డీఈ హౌసింగ్ బాబూరావు,  డి.యల్.డి.ఓ,పి. జగదాంబ, డివిజనల్ పిఆర్వో ఎమ్. లక్ష్మణాచార్యులు,  మునిసిపల్ కమిషనర్ టి.రవికుమార్,  మాజీ ఎమ్మెల్సీ కె.శివరామ కృష్ణ , కొవ్వూరు మునిసిపల్ కౌన్సిలర్లు,  అధికారులు, సర్పంచ్ లు, స్థానిక  నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.