చింతపల్లి మండల కేంద్రంలో త్వరలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు
చింతపల్లి (ప్రజా అమరావతి);
అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పది. గిరిజన ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణే థ్యేయంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు త్వరలో చింతపల్లి మండల కేంద్రంలో బ్లడ్ బ్యాంక్ సేవలను ప్రారంభించనున్నారని రెడ్ క్రాస్ సంస్థ కో ఆర్డినేటర్ ముార్తి తెలపారు
సోమవారం ఆయన మాట్లాడుతూ
ఆపద సమయాల్లో, అత్యవసర ఆపరేషన్ అవసరమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఉపయోగపడేలా చింతపల్లి మండల కేంద్రంలోనే ఈ బ్లడ్ బ్యాంకు అందుబాటులోకి రానుందన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారని ఆయన తెలిపారు
ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం వారు మన గిరిజన ప్రాంతంలోనూ ఈ రక్త నిల్వల కేంద్రాన్ని ఏర్పాటు చేయతలపెట్టారు.
చింతపల్లి చాప్టర్ మరియు బ్లడ్ బ్యాంకు వలన ఈ ప్రాంతంలోని వారికి 24 గంటల పాటు రక్త నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. రక్త హీనత, సికిల్ సెల్ ఎనిమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని కో ఆర్డినేటర్ మూర్తి తెలిపారు. ఈ బ్లడ్ బ్యాంకు వల్ల చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని గిరిజనులకు ఎంతో మేలు కలుగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా మొదట పాడేరులో బ్లడ్ బ్యాంకును ఫిబ్రవరి నెలలో ప్రారంభించనున్నారు. అదేవిధంగా అరకు, చింతపల్లి మండల కేంద్రాల్లోనూ రానున్న రెండు నెలల కాలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ సేవలను విసర్తించదలిచి ఛాప్టర్‌ను ఎంపిక చేయదలిచినట్లు సంస్థ కో ఆర్డినేటర్ ఎంఎస్ఎన్ మూర్తి తెలిపారు.
ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, చింతపల్లి ఛాప్టర్ కమిటీ నియామకం మరియు సభ్యుల ఎంపిక ప్రక్రియనుచెపట్టము జరుగుతుంది న్నారు.
సభ్యులుగా చేరదలిచిన వారు స్థానిక వీరేంద్ర డయాగ్నస్టిక్ కేంద్రం లొ సంప్రదించాలని , ఈమేరకు వెయ్యి యాబై రూపాయలు (రూ.1050/-) చెల్లించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యత్వాన్ని పొందగలరన్నారు.
సామాజిక సృహతో ప్రతీ ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మూర్తి కోరారు..
ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, వర్తకులు, కార్మికులు ముందుకు వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, గిరిజన ప్రాంత ప్రజల ఆరోగ్య అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించాలని ఆశిస్తున్నామన్నారు.
addComments
Post a Comment