ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’

 ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’



 అమరావతి (ప్రజా అమరావతి): పీఆ‍ర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.

‘ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు.

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image