ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమాని టీన్, కామర్స్ వి భాగాల్లో పూర్తి రెసిడెన్షియల్ పీహెచ్డీ కోర్సులు ప్రవేశపెడుతున్న చెన్నై శివ నాడార్ యూనివర్సిటీ


 ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమాని టీన్, కామర్స్ వి భాగాల్లో పూర్తి రెసిడెన్షియల్ పీహెచ్డీ కోర్సులు ప్రవేశపెడుతున్న చెన్నై శివ నాడార్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదివిన వెంటనే డాక్టోరల్ ప్రోగ్రాములు చేసేందుకు వీలుగా ఔతసహిక పరిశోధకుల కోసం డైరెక్ట్ పీహెచ్డీ కోర్సులు కూడా ప్రారంభించనున్న యూనివర్సిటీ డాక్టోరల్ ప్రోగ్రాములకు అడ్మిషన్లు ప్రారంభం, దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31 2022 చెన్నై  జనవరి 12 (ప్రజా అమరావతి): శివ నాడార్ ఫౌండేషన్ వారు ఉన్నత విద్యలో ఏర్పాటుచేసిన మూడో సంస్థ అయిన చెన్నై శివ నాడార్ యూనివర్సిటీ పీహెచ్డీ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ఇంజనీరింగ్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ శాఖలలో అందించు చున్నారు.  పరిశోధకులు వారి డాక్టోరల్ పరిశోధనలను ఫుల్ టైం లేదా పార్ట్ టైం లో వారి ఇష్టాన్ని బట్టి చేయొచ్చు. తమిళనాడులో 1928లో అన్నమలై యూనివర్సిటీ ప్రారంభమైన 90 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ఇది. 2020 లో ఈ యూనివర్సిటీ ప్రారంభమైన వెంటనే ఇప్పుడు ఈ ప్రకటన చేయడం గమనార్హం. తొలిసారిగా ఈ యూనివర్సిటీ లో ఎంతోమంది కోరుకుంటున్న విధంగా ఇంజనీరింగ్ లో డైరెక్ట్ పీహెచ్డీ కోర్సు అందిస్తున్నారు. దీని ద్వారా వివిధ బ్రాంచీలలో ఇంజనీరింగ్, డిగ్రీ చేసిన తర్వాత వెంటనే వారు పరిశోధన ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఈ కోర్సు ద్వారా ఇంజనీరింగ్ పట్టభద్రులు సమతుల్యమైన, అదే సమయంలో పోటీ వాతావరణంలో ఇతర డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుల తో పాటు సమానంగా పరిశోధించి, తమ విద్యా ప్రయాణంలో ఒక సంవత్సరాన్ని ఆదా చేసుకోవచ్చు. పీహెచ్డీ కోర్సు ప్రారంభాన్ని పురస్కరించుకుని చెన్నై శివ నాడార్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీమన్ కుమార్ భట్టాచార్య మాట్లాడుతూ," యూనివర్సిటీ ని ప్రారంభించిన కొద్ది కాలానికి శరవేగంగా డాక్టోరల్ కోర్సును ప్రారంభించాలని నిర్ణయం.. పరిశోధనా కేంద్రంగా ఉండే సంస్థ కావాలన్నా లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ప్రతిభావంతులైన యువతను అత్యున్నత నైపుణ్యం గల పరిశోధకులుగా తీర్చిదిద్ది వారిని ప్రోత్సహించాలన మా లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. వాళ్లు సరికొత్త విజ్ఞానాన్ని సృష్టించి దాంతో దీర్ఘకాల ప్రభావం కలగజేస్తారు. మేం డేటా సైన్స్, స్పీచ్ టెక్నాలజీ, ఈక్విటీ లాంటి  పలు సృజనాత్మక, పురోగామి రంగాల్లో డాక్టోరల్ కోర్సులు అందిస్తున్నాం. వీటివల్లమా విద్యాపరమైన త్రుష్ణతో పాటు  ప్రాక్టికల్ నైపుణ్యాలను మేళవించి బహుళ విధ మార్గాన్ని అనుసరించడానికి వీలవుతుంది" అని చెప్పారు. చెన్నై శివ నాడార్ యూనివర్సిటీ అందిస్తున్నా డాక్టోరల్ రీసెర్చ్ విశ్వ విద్యాలయం లో ఫుల్ టైం పీహెచ్డీ చేసే పరిశోధకులు క్యాంపస్ లోపల షేరింగ్ వసతితో పాటు నెలవారీ రూ. 20,000 అందుకుంటారు. వారి పరిశోధనా కార్యకలాపాలను విస్తరించడానికి వారికి సహాయపడటానికి సంవత్సరానికి రూ. 25,000 కంటింజెన్సీ మొత్తం కూడా అందుతుంది. ఎవరైనా పరిశోధకులకు అప్పటికే పెళ్లి అయితే... వారికి యూనివర్సిటీ నామ మాత్రపు అద్దెతో క్యాంపస్ పరిధిలోనే అందించే వసతి తో సౌకర్యవంతంగా తమ పరిశోధనను కొనసాగించవచ్చు. ఇందుకోసం యూనివర్సిటీ ప్రత్యేకంగా పరిగణించి వారికి ఈ సౌకర్యం కల్పిస్తుంది. భారతదేశంలో వివిధ పరిశోధనా ప్రయోగశాలలు లేదా విద్యాసంస్థల్లో పూర్తికాల అధ్యాపకులుగా పని చేసే అభ్యర్థులు పార్ట్టైం పీహెచ్డీ చేయొచ్చు. ఇలాంటి అభ్యర్థులకు ఈ పార్ట్ టైం కోర్సులో చెన్నై శివ నాడార్ యూనివర్సిటీ లో ఉన్న అత్యాధునిక పరిశోధనా సదుపాయాలు, ప్రయోగశాల పరికరాలను ఉపయోగించుకొని తమ పరిశోధనను కొనసాగించే అవకాశం లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, స్పీచ్ టెక్నాలజీ, డేటా సైన్స్, బయోమెట్రిక్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, మెర్జెస్ అండ్  ఎక్విజిషన్స్... ఇలాంటి అనేక విభిన్నమైన రంగాల్లో చేసేందుకు యూనివర్సిటీ అవకాశం కనిపిస్తుంది. పరిశోధన కోర్సులకు సంబంధించిన ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.https://www.snuchennai.edu.in/research ప్రవేశాల ప్రక్రియ, అర్హత ఆసక్తిగల పరిశోధక అభ్యర్థులు తమ దరఖాస్తులను https://apply.snuchennaiadmissions.com/ వెబ్సైట్లో 2022 జనవరి 31లోగా ఆన్లైన్లో సమర్పించాలి. ప్రవేశాల ప్రక్రియలో రెండంచెల ఎంపిక విధానం ఉంటుంది. ముందుగా ఒక రాత పరీక్ష రాయాలి ఆ తర్వాత అందులో ఎంపికైన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. భారతీయులు, ఎన్నారైలు, విదేశీ మూలాలు కలిగిన వ్యక్తులు విదేశీ పౌరసత్వం ఉన్న వారికి కూడా యూనివర్సిటీలో ప్రవేశాలు లభిస్తాయి.

Comments