రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి. - ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయ కల్లం.


 కారుమంచి (ప్రజా అమరావతి);


రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి.

                - ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయ కల్లం.గ్రామాల అభ్యున్నతి గ్రామీణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా కృషి చేసిన నాడే సాధ్యమౌవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయ కల్లం పేర్కొన్నారు.ఈనెల 13వ తేదీ ఉదయం టంగుటూరు మండలం కారుమంచి గ్రామం లో మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కీ.శే కాకుమాని చిన్న వెంకటసుబ్బారెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. సమాజం కోసం,నలుగురు అభివృద్ధి కోసం జీవించడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని తెలిపారు.1951 లో  కీ.శే కాకుమాని చిన్న వెంకటసుబ్బారెడ్డి కారుమంచి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను స్థాపించి చుట్టుప్రక్కల 14 గ్రామాలకు విద్యను అందించిన విద్యా ప్రదాత అని కొనియాడారు. నేడు రాజకీయ విలువలు క్షీణిస్తున్నాయని అర్ధబలం,అంగ బలాలకే ప్రాధాన్యత పెరిగి సేవాతత్పరత తగ్గుతుందన్నారు. ప్రజలలో వినియోగతత్వం పెరిగి ప్రజల సంపద దుర్వినియోగం అవుతుందన్నారు.కారుమంచి గ్రామ అభివృద్ధికి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చేస్తున్న కృషి అద్వితీయమని దానిని కొనసాగించాలని కోరారు. శాసనమండలి సభ్యులు కె.ఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి తో నాలుగు దశాబ్దాల పరిచయం ఉందని అక్షరాస్యతా ఉద్యమం, మద్య వ్యతిరేక ఉద్యమం,శాస్త్రీయ భావజాల వ్యాప్తి లో విశిష్ట కృషి చేశారన్నారు.ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉందని జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి జరగాలన్నారు.కులం,మతం,వర్గం రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ అభివృద్ధి వైపు దృష్టి సాధించాలన్నారు.గోల్కొండ హోటల్ గ్రూప్స్ సంస్థల వ్యవస్థాపకులు నడికట్టు రామిరెడ్డి ప్రసంగిస్తూ తన స్వగ్రామమైన చిరుమామిళ్ల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నానని వారి అనుభవాలను వివరించారు.గ్రామంలో కక్షలు,   ముఠాలు లాంటి వాటికి తావివ్వకుండా అభివృద్ధి కి కృషి జరగాలన్నారు.120 మంది మహిళలను ఎంపిక చేసి వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందించి వారికి ఉచితంగా కుట్టుమిషన్లు అందించడం అభినందనీయమన్నారు.సభకు అధ్యక్షత వహించిన మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కీ.శే కాకుమాను చిన్న వెంకటసుబ్బారెడ్డి అభివృద్ధికి పునాది వేశారని వారి త్యాగనిరతిని కొనియాడారు.మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి స్వయం ఉపాధి సాధనకు కుట్టు మిషన్లు తోడ్పడ్డతాయని పేర్కొన్నారు. త్వరలో 1951 నుండి నేటి వరకూ వాకా రాఘవరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన అందరి వివరాలను సేకరించి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తామని తెలిపారు.స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ శివరామిరెడ్డి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కుట్టు మిషన్ ల శిక్షణను మహిళలకు అందిస్తున్నామని తెలిపారు.1951 లో హైస్కూలు విద్యను అభ్యసించిన ప్రొఫెసర్ కంజుల కోటిరెడ్డి 50 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించి గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడుతాను అని వివరించారు.1958 లో విద్యార్థి అయిన పావులూరు శ్రీలక్ష్మి మధ్యాహ్న భోజనాన్ని మరింత మెరుగు పరచడానికి మంచి పోషకాహారాన్ని అందిస్తానని ప్రకటించారు.ప్రముఖ సినీ దర్శకుడు బి.గోపాల్ ప్రసంగిస్తూ  త్వరలో జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని సభలో ప్రకటించారు.మరో పూర్వ విద్యార్థి డాకా పిచ్చి రెడ్డి తరుపున సరోవర్ హోటల్ అధినేత డాకా కోటిరెడ్డి 50 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.ప్రముఖ దర్శకులు, నంది అవార్డు గ్రహీత పాటిబండ్ల ఆనందరావు ప్రసంగిస్తూ 1958 వ సంవత్సరంలో హై స్కూల్లో చదువుకున్న ఆనాటి జ్ఞాపకాలను తెలిపి హైస్కూల్ అభివృద్ధికి తన స్నేహితుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.మాజీ మంత్రివర్యులు,ప్రస్తుత శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ కీ.శే కాకుమాను చిన్న వెంకటసుబ్బారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆరు నెలల పాటు కుట్టు మిషన్ ల శిక్షణ అందించిన మహిళలకు స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ వారు ఉచితంగా కుట్టు మిషన్ లను అందించారు.ఈ కార్యక్రమంలో కారుమంచి గ్రామంలోని 6గురు పారిశుద్ధ్య కార్మికులకు,జూనియర్ లైన్ మెన్ రవీంద్ర,హెల్త్ అసిస్టెంట్ సురేష్ లను  అజేయ కల్లం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్,టంగుటూరు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు దగ్గుమాటి సుమన్ రెడ్డి,మా ఊరి అభివృద్ధి కమిటీ కో-ఆర్డినేటర్లు చిట్టేల రామిరెడ్డి, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.