ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పవన్ సాయి,శ్రీనివాస్ మొబైల్ రోబిటిక్స్ అనే అంశం పై రాష్ట్రం నుంచి ప్రాధాన్యత వహించి బంగారు పతకం కైవసం చేసుకున్నారు.

తాడేపల్లి (ప్రజా అమరావతి);      జనవరి 7 నుంచి 10 వరకు ఢిల్లీలో నిర్వహించిన  భారతదేశ నైపుణ్య పోటీలో కె.ఎల్.విశ్వవిద్యాలయం విద్యార్థులు సత్తా చటారని రిజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.ఎస్.వి.ప్రసాద్రావు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పి.శ్రీమన్నారాయణ ఆడిటివ్ మనుఫ్యాక్చరింగ్ అనే అంశం పై, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పవన్ సాయి,శ్రీనివాస్ మొబైల్ రోబిటిక్స్ అనే అంశం పై రాష్ట్రం నుంచి ప్రాధాన్యత వహించి బంగారు పతకం కైవసం చేసుకున్నార


ని వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులు ఆగస్ట్ లో షాంగై లో నిర్వహించే ప్రపంచ నైపుణ్య పోటీలకు భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. గెలుపొందిన విద్యార్థులకు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి, విద్యార్థుల పోటీల ఖర్చు కూడా అంద చేస్తున్నామని తెలిపారు.తమ విశ్వవిద్యాలయం లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సాహం అందిస్తున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్ రెడ్డి కి విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ యాజమాన్యం, ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ,ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్.వెంకట్రామ్, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ శ్రీనాధ్, వివిధ విభాగాల డీన్లు, విభాగఅధిపతులు, అధ్యాపకులు విద్యార్థులు అభినందించారు.

Comments