- కే కన్వెన్షన్ కు వస్తే గుడివాడ నియోజకవర్గ ప్రజలే నీ అంతు చూస్తారు
- నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం హెచ్చరిక
గుడివాడ, జనవరి 25 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను ఏదో చేస్తానని మాట్లాడుతున్న బుద్ధా వెంకన్న గుడివాడలోని కే కన్వెన్షన్ కు వస్తే గుడివాడ నియోజకవర్గ ప్రజలే ఆయన అంతు చూస్తారని నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం హెచ్చరించారు. మంగళవారం గుడివాడ లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్లో ఆయన మీడియాతో కే మాట్లాడారు. కే కన్వెన్షన్లో కేసినో జరిగిందని చెబుతున్న టీడీపీ నేతలు నిరూపించలేకపోతున్నారని అన్నారు. మంత్రి కొడాలి నానిని ఏదో విధంగా అల్లరి చేయాలని తోక పార్టీలతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్నారు. టీడీపీ నేతల మాటలు నమ్మే పరిస్థితి గుడివాడ నియోజకవర్గంలో లేదన్నారు. మంత్రి కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గంలో పటిష్టమైన సైన్యం ఉందని చెప్పారు. పార్టీ బీజేపీ నేతలను రెచ్చగొట్టినా గుడివాడలో చేసేదేమీ ఉండదన్నారు. ఇప్పటికే మంత్రి కొడాలి నాని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారని, ఇంకో నాలుగుసార్లు గెల్పించేందుకు గుడివాడ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మంత్రి కొడాలి నానిపై విమర్శలు మానుకోవాలని సూచించారు. రాజకీయంగా మంత్రి కొడాలి నానిని ఎదుర్కొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. మంత్రి కొడాలి నాని వెనక లక్షలాది మంది ప్రజలు ఉన్నారని, ఆయనపై అనవసరం ఆరోపణలు చేయవద్దన్నారు. లేకుంటే తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని పెయ్యల ఆదాం హెచ్చరించారు.
addComments
Post a Comment