కోడిపందాలు నిర్వహణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలికొవ్వూరు (ప్రజా అమరావతి);


కోడిపందాలు నిర్వహణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలిజనవరి 15 నాటికి రబీ నాట్లు  పూర్తి అవ్వాలి.. రైతుల్లో అవగాహన కల్పించాలి


ఓటీఎస్ లబ్దిదారులతో జనవరి 11, 12 తేదీల్లో మెగా మేళా ఏర్పాటు చేయాలి


మండల స్థాయి అధికారులు జాయింట్ యాక్షన్ టీం గా సమన్వయం చేసుకోవాలి


ఆర్డీవో ఎస్. మల్లిబాబు


కొవ్వూరు డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందెలు , ఇతర నిషేధిత క్రీడలు నిర్వహించుట చట్టవ్యతిరేకమైనవిగా పరిగణించటం జరుగుతోందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు.


శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డిఎస్పీ శ్రీనాధ్ తో  కలిసి తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు, సంబంధిత  శాఖల అధికారు లతో దృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా చట్టవ్యతిరేక చర్యలలో భాగంగా కోడి పందాలు , ఇతర ఆటలను నిర్వహించేందుకు కొందరు ఔత్సాహికులు ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రణాళికలు తయారు చేయడం జరుగుతోందని, అటువంటివి నిరోధించడానికి మండల స్థాయిలో అధికారులు బృందాలు గా ఏర్పడి పోలీసు అధికారులు రూపొందించిన మార్గదర్సకాలు కఠినంగా అమలు చెయ్యాల్సి ఉందన్నారు. మండల స్థాయిలో అధికారులు టీమ్స్ గా ఏర్పడి ప్రజల్లో, నిర్వాహకుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. గౌరవ న్యాయ స్థానం, జిల్లా కలెక్టర్ వారిచే  కోడి పందెలు నిర్వహించకుండా చూడాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండి, ప్రతి చర్యను రికార్డ్ చెయ్యాల్సి ఉందని మల్లిబాబు ఆదేశించారు. 

రబీ సీజన్ కి సంబంధించిన నాట్లు జనవరి 15 నాటికి పూర్తి చెయ్యాల్సి ఉందని, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారి కలిసి రైతులకు పత్రికలు, సమావేశాలు ద్వారా అవగాహన కల్పించాలని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. రబీ లో సాగుచేసే లక్ష్యాలపై నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలన్నారు. 


ఓటీఎస్ కి సంబంధించి జనవరి 11, 12 తేదీల్లో మండల పరిధిలో మెగా మేళా చెప్పట్టాల్సి ఉందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. లబ్దిదారులకి అవగాహన కల్పించి, చెల్లింపు లు జరిపేలా అడుగులు వెయ్యాల్సి ఉందన్నారు. ఓటిఎస్ కి సంబంధించిన వారి డేటా నమోదు, లబ్దిదారుల గుర్తింపు, ఓటీఎస్ చెల్లింపు చేసిన వారి వివరాలు నమోదు సమర్ధవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న వారి సమగ్ర సమాచారం గ్రామ, వార్డు కార్యదర్సులు గుర్తించాలన్నారు. అసంబద్ధ కారణాలు చూపుతూ నివేదికలు ఇవ్వడం సరికాదన్నారు.


డిఎస్పీ బి. శ్రీనాధ్ మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో ఎక్కడా కోడి పందెలు, ఇతర నిషేధ ఆటలు నిర్వహణ  కోసం బరులు ఏర్పాటు కై కొందరు ప్రయత్నాలు చేసుకుంటా రని, అటువంటి వాటిని నిరోధించడానికి అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాల్సి ఉందన్నారు. బరులు, షేడ్స్ ఏర్పాటు కి యంత్రాలు, భూములు చదును చేసుకుంటున్నారని, మండలంలోని, గ్రామంలోని అధికారులు, సిబ్బంది అటువంటి వాటి ఫోటోలు తియ్యడం, వీడియోలు చిత్రీకరణ చెయ్యాల్సి ఉందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా భూముల చదును తదితర పనులు చేసే వారిపై బైండోవర్ కేసులు నమోదు చెయ్యాలని శ్రీనాధ్ స్పష్టం చేశారు. కొవ్వూరు మండలం కి సంబంధించిన వారం క్రితం హై కోర్ట్ లో రెండు పిల్స్ వేశారని, ఒకటి వాడపల్లి, తొగుమ్మి, మద్దూరు లకు చెందినది, మరొకటి కొవ్వూరు పట్టణానికి, మండకానికి చెందినదని తెలిపారు. అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ఏమైనా అనుమానం వొస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని శ్రీనాధ్ పేర్కొన్నారు. తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, పశు సంవర్ధక, ఎన్ జి ఓ లతో కూడి మండల స్థాయి లో కమిటీ లు వేసుకుని, రోజువారీ నివేదికను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు  సమర్పించాలన్నారు.


ఈ సమావేశంలో కొవ్వూరు లో డీఈ హౌసింగ్ సీహెచ్. బాబూరావు, తహసీల్దార్ బి.నాగరాజు నాయక్, మండలాలు నుంచి తహసీల్దార్ లు, ఎంపీడీఓ కు, సి. ఐ. లు, ఎస్.హెచ్.ఓ. (పోలీస్)లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.