కాకాణి చేతులు మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ

 *" కాకాణి చేతులు మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ


"**శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ముస్లిం కుటుంబాలకు, నిరుపేద గిరిజనులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


*ఇందిరమ్మ కాలనీలో నూతనంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు కరెంట్ మీటర్లు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.*


*సెపక్ టాక్రా క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కాకాణి.*
 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ ఒకే విడతలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు.


 ఇళ్ల స్థలాలు ఇప్పటికీ లేని వారు ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటే, 90రోజుల కాలవ్యవధిలో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం.


 మహానేత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ కాలనీలో ముస్లిం కుటుంబాలు, నిరుపేద గిరిజనులు నివసిస్తున్నారు.


 ఇందిరమ్మ కాలనీలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి, ఇళ్ల పట్టాలు అందించడం సంతోషంగా ఉంది.


 తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినా, ఆధికారాన్ని అనుభవించి పోవడం తప్ప, పేదల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు.


 ముత్తుకూరు మండలంలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి, సిమెంటు రోడ్లు, సైడ్ డ్రైన్లు, తాగునీటి వసతి, సాగునీటి సౌకర్యం కల్పించాం.


 ముత్తుకూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 19 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇళ్లు లేని వారందరికీ నూతన ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు, ఇళ్లు కూడా మంజూరు చేయించి నిర్మిస్తాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో మౌలిక సదుపాయాలను దాదాపుగా పూర్తి చేయడంతో, పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.


 అర్హత కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాలు అందించడం, ఇళ్లు  నిర్మించడంతో పాటు, సంక్షేమ ఫలాలను అందించే బాధ్యత నాది.


 పేదలకు ఇళ్ల స్థలాలు, కరెంట్ మీటర్ల పంపిణీకి సహకరించిన తహశీల్దార్ కు, రెవిన్యూ సిబ్బందికి, విద్యుత్ శాఖ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.