కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి*
*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
ధర్మవరం, జనవరి 11 ప్రజా అమరావతి);
*కరోనా కొత్త వేరియంట్ ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ 19 కొత్త వేరియంట్ వస్తోందని, ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసే కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో కోవిడ్ కేర్ సెంటర్ ఉందని, ఇందులో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసులు పెరుగుతున్న వేళ పట్టణంలోని
కనీసం 200 పడకలు ఏర్పాటు చేసేందుకు పాఠశాలలు తప్ప మిగిలిన ఏమైనా కళ్యాణ మండపాలు, మల్టీ స్టోర్ భవనాలు వంటివి గుర్తించాలన్నారు . అదేవిధంగా తరగతులు నిర్వహించ కుండ ఖాళీగా ఉన్న విద్యాసంస్థల భవనాలను పరిగణలోనికి తీసుకోవచ్చునన్నారు.ఈ విషయంలో నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు స్థానిక తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు . అవసరమైనప్పుడు సేవలు ఉపయోగించుకునేలా చూడాలన్నారు. కరోనా నేపథ్యంలో ముందుగానే అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, మెడికల్ సిబ్బందిని నియామకం చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. కేసులు మరిన్ని పెరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.*
*ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్, తహసీల్దార్ నీలకంఠా రెడ్డి, ఇంచార్జి ప్రిన్సిపాల్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.*
--
addComments
Post a Comment