చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

 కొల్లిపర (ప్రజా అమరావతి); చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.దక్షిణాది రాష్ట్రాల గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్ పేరాల శేఖర్. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని దక్షిణాది రాష్ట్రాల ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్ పేరాల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రం కొల్లిపర ఆరి మండ వారి కళ్యాణమండపంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.  కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆరి మండ దీపిక అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పేరాల శేఖర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు పరిశ్రమలను ఏర్పాటు చేసు కుంటే ప్రాజెక్టును బట్టి రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పరిశ్రమను బట్టి సబ్సిడీ కూడా ఉంటుందన్నారు. ఆవులు, గేదెల ఫారం, తేనెటీగలు, పట్టుపురుగులు, ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్, పచ్చళ్ళు, పిండి వంటలు తయారీ వంటి కుటీర పరిశ్రమలు పెట్టుకో దలచినవారు కె వి ఐ సి, కె వి ఐ బి, డి ఐ సి, సంస్థలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో కె వి ఐ సి రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ గ్రిఫ్, ఎంపీడీవో శ్రీనివాసులు, గ్రామ పెద్దలు కళ్ళం వీరా రెడ్డి, నెర్ల కుటుంబ రెడ్డి, రెడ్డి వెంకటపా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.